Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గా ఇండస్ట్రీలో వెలిగిపోతున్న సమయంలోనే వాటిని కాస్త పక్కన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి, కొత్త పార్టీ స్థాపించి చాలాకాలమే అయినా అటు పాలిటిక్స్‌ను, ఇటు సినిమాలను మ్యానేజ్ చేస్తూ వచ్చారు. అలా కొన్నేళ్లు పవన్ కళ్యాణ్‌ను తెరపై చూసి ఆనందించారు అభిమానులు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయాల్లో తన మొదటి ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు పవన్. అదే సమయంలో పలు ప్రాజెక్ట్స్‌ను ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీ అయిపోవడంతో ఆయన సినిమాలు చిక్కుల్లో పడ్డాయి.
కొత్త కష్టాలు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పలు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కానీ ఆయన రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఈ సినిమాల సెట్స్‌లో అడుగుపెడితేనే వీటి షూటింగ్ పూర్తవుతుంది. అప్పుడే ఇవి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బ్యాక్ టు బ్యాక్ పనులతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయనకు సినిమాలకు ఇవ్వడానికి టైమ్ దొరకడం లేదు. కొన్నాళ్ల క్రితం పాలిటిక్స్‌కు బ్రేక్ ఇచ్చి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్. కానీ అది సరిపోలేదు. కాబట్టి షూటింగ్ పూర్తవ్వలేదు. ఇంకా కొన్నిరోజులు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవ్వకుండా, చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే దీనికి కొత్త కష్టాలు రాబోతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
రిలీజ్ డౌటే
పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎమ్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘హరి హర వీరమల్లు’. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న సమయంలో దీనిని ఒప్పుకున్నారు పవన్. దీనికోసం చాలారోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేశారు. అంతలోనే ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే త్వరగా షూటింగ్ పూర్తవుతుందనే ఆశతో ముందుగా మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. దీంతో మే 9కి ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడం చూస్తుంటే మేలో కూడా ఈ మూవీ రిలీజ్ డౌటే అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దీంతో మేకర్స్‌పై భారీ ఎఫెక్ట్ పడనుంది.
Also Read: ఆక్సిజన్ మాస్క్‌తో పవన్ కుమారుడు.. ఈ ఫోటో చూస్తే గుండె బరువెక్కుతుంది..
డీల్ క్యాన్సిల్
ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. కానీ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఈ డీల్‌లో మార్పులు చేయాలని అమెజాన్ యాజమాన్యం నిర్ణయించుకుందని సమాచారం. మే 9న ఈ మూవీ రిలీజ్ కాకపోతే డీల్‌లో 50 శాతం కట్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో ‘హరి హర వీరమల్లు’కు ఎక్కడా లేని కష్టాలు ఎదురవుతున్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ఓటీటీ డీల్ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియకపోయినా.. ఇలా వరుసగా వాయిదాలు పడుతుంటే సినిమాపై ప్రేక్షకుల్లో సైతం ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.