BigTV English
Advertisement

Alexis Lorenze Viral: టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

Alexis Lorenze Viral: టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

Alexis Lorenze Viral| సోషల్ మీడియాలో ఇటీవల అలెక్సిస్ లోరెన్జ్ అనే యువతి గురించి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో అందంగా ఉండే ఆమె ఒక్కసారిగా అందవిహీనంగా మారి చావుతో పోరాడుతున్నట్లు వీడియోల్లో పేర్కొంది. ఆమె ముఖం ఒక్కసారి చూడగానే వికారం అనిపిస్తుంది. దానికి కారణం డాక్టర్లు ఆమె ఇచ్చిన వ్యాక్సిన్లని ఆమె తెలిపింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల అలెక్సిస్ లోరెన్జ్ తరుచూ తన అందం గురించి, మంచి లుక్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అయితే ఆమెకు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఆమె రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉందని డాక్టర్లు గుర్తించారు. అలెక్సిస్ కు అరుదైన పారోక్సిమల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా అనే బ్లడ్ డిజార్డర్ ఉందని పరీక్షలో తేలింది. దానికి బ్లడ్ ట్రాన్స్‌ఫర్ చేయాలని వైద్యులు సూచించారు. కొన్ని నెలలపాటు బ్లడ్ ట్రాన్స్‌ఫర్ చేసినా ఫలితాలు లేకపోవడంతో ఆమె నిపుణులను సంప్రదించింది.

నిపుణుల ఆమె సమస్యకు మూడు రకాల వ్యాక్సిన్లు తీసుకోవాలని చెప్పారు. ఆ తరువాత ఆమె క్యాలిఫోర్నియాలోని యుసిఐ మెడికల్ సెంటర్ లో మెనింగైటిస్, న్యూమోనియా, టెటనస్.. ఈ మూడు వ్యాక్సిన్లు ఒకేసారి తీసుకుంది. ఆ వ్యాక్సిన్లు తీసుకున్న కొన్ని గంటల తరువాత ఆమె ముఖం, మెడ, చేతులు వాచిపోయాయి. రక్తం గడ్డినట్లు అన్ని కండరాల్లో ఎర్రగా వాపు కనిపించింది. ఎంతో అందంగా ఉండే అలెక్సిస్ ఒక్కసారి చూడడానికి వికృతంగా మారిపోయింది.


అలెక్సిస్ వెంటనే ఆస్పత్రిలో ఎమెర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం అడ్మిట్ అయిపోయింది. కానీ క్రమంగా ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. అయినా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. తన ఆరోగ్యం గురించి వివరిస్తూ.. తన ఒళ్లంతా మంటగా ఉందని చాలా కష్టంగా మాట్లాడుతోంది. ”నాకు డాక్టర్లు ఏదో ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తరువాతే నాకు ఇలా అయింది. నాకు ఊపిరి సరిగా ఆడడం లేదు. వీళ్ల నాకు నొప్పి తగ్గడానికి మందులు ఇస్తున్నారు. కానీ ఫలితం లేదు. అయినా అవే మందులు ఇంకా ఎక్కువ మోతాదులో ఇస్తున్నారు. నన్ను ఎవరైనా కాపాడండి.” అంటూ దీనంగా వీడియోలో అలెక్సిస్ వేడుకుంది.

Also Read: ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..

అలెక్సిస్ తండ్రి టాడ్ లోరెన్జ్ తన కూతురు ఆరోగ్యం గురించి రెగులర్ గా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు.

Related News

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Big Stories

×