BigTV English

Vaibhav Suryavanshi – Babar Azam: పరువు పాయె…13 ఏళ్ల వైభవ్‌ కంటే….పాకిస్థాన్‌ బాబర్‌ జీతం తక్కువే ?

Vaibhav Suryavanshi – Babar Azam: పరువు పాయె…13 ఏళ్ల వైభవ్‌ కంటే….పాకిస్థాన్‌ బాబర్‌ జీతం తక్కువే ?

Vaibhav Suryavanshi – Babar Azam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు (2025 Indian Premier League  ) సంబంధించిన మెగా వేలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. నవంబర్ 24 అలాగే నవంబర్ 25 వ తేదీలలో… మెగా వేలం ( IPL Auction 2025 )… నిర్వహించారు. ఇందులో 10 ఫ్రాంచైజీలు రకరకాల ప్లేయర్లను ఎంచుకున్నాయి. కొంతమంది ప్లేయర్ లపై కోట్ల వర్షం కురిస్తే… మరి కొంతమంది… రికార్డు ధర పలికి రికార్డులు సృష్టించారు. మరి కొంతమంది ప్లేయర్లు అన్ సోల్డ్.. లిస్టులోకి వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే.


Also Read: IPL 2025 Auction: ఐపీఎల్-2025 మెగావేలంలో తెలుగు ఆటగాళ్ల హవా !

అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు (2025 Indian Premier League  ) సంబంధించిన మెగా వేలంలో ఒక అద్భుతం జరిగింది. అదే వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ). 13 సంవత్సరాల వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అతనికి ఏకంగా 1.10 కోట్లు పెట్టింది రాజస్థాన్ రాయల్స్. వాస్తవంగా మెగా వేలంలోకి 30 లక్షల బేస్ ధరతో రంగంలోకి దిగాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ). కానీ ఎవరు ఊహించని ధరను పలికాడు.


వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi )  తన కెరీర్లో… అద్భుతంగా ఆడటంతో మెగా వేలంలో  ( IPL Auction 2025 ) మంచి ధర పలికాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం ( Babar azam) కంటే… ఎక్కువ జీతం తీసుకుంటున్న కుర్రాడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించడం జరిగింది. ఐపీఎల్ మెగా వేలంలో ( IPL Auction 2025 ) సూర్య వంశీకి… 1.10 కోట్ల ధర వచ్చింది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాబర్ ధర 1.09 కోట్లు మాత్రమే. అంటే వైభవ్ సూర్యవంశం కంటే పది లక్షలు తక్కువగానే తీసుకుంటున్నాడు బాబర్.

Also Read: IPL 2025 All Teams Squad: వేలం తర్వాత 10 జట్ల ప్లేయర్స్ లిస్ట్ !

ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.13 సంవత్సరాల కుర్రాడి కంటే పాకిస్తాన్ ప్లేయర్లు తక్కువ జీతం తీసుకుంటున్నారని పాకిస్తాన్ క్రికెట్ లీగ్ పైన… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటివి పిఎస్ఎల్ … ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీ వస్తుందా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాతో పెట్టుకుంటే ఏ విషయంలోనైనా పాకిస్తాన్ చిత్తుచిత్తు కావాల్సిందేనని… భారతీయులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (2025 Indian Premier League  ) ప్రస్తుతం సూర్య వంశీ వయసు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. 13 సంవత్సరాల క్రికెటర్ సూర్య వంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడ వచ్చా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 15 సంవత్సరాలు నిండితేనే ఐపిఎల్ లో ఆడాలని కొంతమంది అంటున్నారు. 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ప్లేయర్లు డబ్బులు అర్జించే క్రికెట్ లీగ్ లలో ఆడకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే బాల కార్మిక చట్టం కింద చర్యలు తప్పవని కూడా పేర్కొంటున్నారు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×