BigTV English
Advertisement

Viral Video: పెళ్లి కూతురు దొరకట్లేదని.. గేదెను పెళ్లి చేసుకున్నాడు..

Viral Video: పెళ్లి కూతురు దొరకట్లేదని.. గేదెను పెళ్లి చేసుకున్నాడు..

Viral Video: ప్రస్తుత కాలంలో యువకులు పెళ్లి కాని ప్రసాదుల్లా తయారవుతున్నారు. ఈ కాలంలో పిల్ల దొరకాలంటే నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే ఒకప్పుడు కట్నకానుకలు సరిగా ఇవ్వడం లేదని యువకులే తిరస్కరించే రోజులు ఉండగా.. ప్రస్తుతం పిల్ల దొరికితే అదే చాలు అనే పరిస్థితులు ఎదురయ్యాయి. పెళ్లి చేసుకునే వాడు ఉద్యోగం, మంచి ఇళ్లు, స్టైల్ గా ఉండే వ్యక్తి అయి ఉండాలని ఆలోచిస్తున్నారు.


సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణతో ఫేమస్ అయిన వ్యక్తులపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో చాలా మంది యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ యువకుడు పెళ్లి కావట్లేదని వినూత్న రీతిలో చేసిన ఓ పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. తనకు పెళ్లి కావడం లేదని, పెళ్లి కూతురు కోసం వెతికితే దొరకట్లేదని, విసిగిపోయిన ఓ యువకుడు ఏకంగా గేదెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. దీనికి తన తల్లిదండ్రులు కూడా సహకరించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఓ గేదెను వివాహం చేసుకున్న యువకుడు ఇంటికి తీసుకువచ్చి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు. గేదెకు, తన మెడలో పూల దండలు వేసుకుని ఉన్నాడు. ఇంటి ముందు ఉన్న యువకుడికి, గేదెకు తల్లి తిలకం పెట్టి, హారతి ఇచ్చింది. అనంతరం గేదెపై చున్నీ కప్పి, గేదెను ఎక్కి వెళ్లాలని అనుకున్నాడు. అయితే గేదెపై కొంచెం దూరం వెళ్లడంతో యువకుడిని గేదె కిందపడేసింది. దీంతో యువకుడి కాలికి గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Related News

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Big Stories

×