BigTV English

Elon Musk: మస్క్ మామూలోడు కాదు.. కేంద్రాన్నే కోర్టుకి లాగాడు

Elon Musk: మస్క్ మామూలోడు కాదు.. కేంద్రాన్నే కోర్టుకి లాగాడు

ఎక్స్ అధినేత మస్క్ భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కాడు. భారత ప్రభుత్వం ఎక్స్ పై సెన్సార్ షిప్ విధిస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తూ కర్నాటకలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎక్స్ కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అయిన ‘గ్రోక్’ బూతు పురాణంపై కేంద్రం దృష్టిసారించిన వేళ, ఈ పిటిషన్ ఆసక్తికరంగా మారింది.


అసలేంటి కేసు..?
భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ చట్టంలో సెక్షన్ 69A, 79 నిబంధనలు చాలా పవర్ ఫుల్. దీని ప్రకారం సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేకమైన కంటెంట్ ఉంటే.. ఆయా ఖాతాలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు. అదే కోవలో ఎక్స్ ఖాతాలపై కూడా భారత ప్రభుత్వం నిఘా పెట్టింది. దేశంలో అల్లర్లు, అంతర్గత ఘర్షణలకు కారణమయ్యే పోస్ట్ లు, తమ వ్యక్తిగత వివరాలు లేకుండా సృష్టించే ఖాతాలపై కేంద్రానికి నియంత్రకణ కల్గించేలా సెక్షన్ 69A ఉంది ఇక సెక్షన్ 79లో కొన్ని విస్తృత అర్థాలున్నాయి. అందులో ప్రభుత్వానికి కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కంటెంట్ ని తొలగించేందుకు 36 గంటలసమయం ఇచ్చి, ఆలోగా చర్యలు తీసుకోకపోతే.. దాన్ని ఆటోమేటిక్ గా డిలీట్ చేయొచ్చనే వెసులుబాటు సెక్షన్ 79 ఇస్తోంది. అంటే ఇది పూర్తిగా ఏకపక్ష సెన్సార్ షిప్ అని వాదిస్తున్నారు మస్క్ తరపు న్యాయవాదులు. దీనిపై కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో యూట్యూబ్ లో అసభ్యకర కంటెంట్ రాజ్యమేలేది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడు అదంతా ఎక్స్ లోకి డంప్ అవుతోంది. ఎక్స్ లో కేవలం లింక్ లు మాత్రమే పోస్ట్ చేసి, దాన్ని హోస్ట్ చేసే సైట్స్ కి యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు అల్లర్లను సృష్టించడానికి కొంతమంది విద్రోహ శక్తులు కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను వాడుకుంటున్నారు. ఇటీవల ఏపీలో ఐటీ చట్టం ప్రకారం కొన్ని కేసులు నమోదయ్యాయి. మరికొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ రాజకీయ వ్యతిరేక కంటెంట్ అంతా ఎక్స్ లోనే సర్కులేట్ అవుతోంది. దీనిపై కూడా ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ అధినేత మస్క్ కోర్టుకెక్కాలనే నిర్ణయం తీసుకోవడం విశేషం.


సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి బహుళజాతి కంపెనీలు కోర్టుకెక్కడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి మనుగడ సాగించాలనుకోవడం సాహసమనే చెప్పాలి. కానీ మస్క్ మామూలోడు కాదు, ఆయన వెనక ట్రంప్ ఉన్నాడు. అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకునే మస్క్ దూకుడుమీదున్నాడు. అందుకే భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కాడు. అయితే గ్రోక్ వివాదం నడుస్తున్న ఈ సమయంలోనే మస్క్ కోర్టుకెక్కడం మాత్రం ఇక్కడ విశేషం. గ్రోక్ వాడే భాషను కంట్రోల్ లో పెట్టేందుకు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్న వేళష ఐటీ సెక్షన్ల పేరుతో ఎక్స్ తరపు న్యాయవాదులు వ్యవహారాన్ని కోర్టు ముందుంచారు.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×