పెళ్లనేది నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైతే.. జీవితాంతం కలిసే ఉండాలి. పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలి. భర్తను భార్య, భార్యను భర్త ప్రేమగా చూసుకుంటూ కాపురం అనే కాలాన్ని వెళ్లదీయాలి. కష్టాలు, కన్నీళ్లు అనేవి జీవితంలో వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. భార్యభర్తలు అన్నాక, అలకలూ, కొట్లాటలు తప్పవు. రెండు రోజుల్లో మళ్లీ కలిసి పోవాల్సిందే. కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిందే!
తగ్గిన రాజీ స్వభావం
ఒకప్పుడు భార్యభర్తల్లో కాంప్రమైజ్ గుణం ఉండేది. ఎవరిది తప్పైనా ఇతరుల రాజీపడేది. రెండు మాటలు అన్నా, రెండు మాటలు పడ్డా, పెద్దా పట్టించుకునే వాళ్లు కాదు. సంసారం అన్నాక ఇలాంటి జరుగుతూనే ఉంటాయి అనుకునేవాళ్లు. ఎప్పుడైనా గొడవలు జరిగినా, కాసేపు అరచుకుని మళ్లీ కామన్ అయ్యేవాళ్లు. యథావిధిగా జీవితాన్ని కొనసాగించే వాళ్లు. పిల్లల కోసం, వాళ్ల భవిష్యత్ కోసం కొన్ని విషయాల్లో రాజీ అయ్యేవాళ్లు. ఇంట్లో ఎన్ని జరిగినా, గడపదాటి ఆ విషయాలు బయటకు వచ్చేవి కాదు. కానీ, ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఒకరి మీద, మరొకరి పెత్తనాన్ని ఎవరూ భరించడం లేదు. నువ్వెంతో నేనంత అనే స్థాయికి చేరారు. ఈగోలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకుంటున్నారు. లొంగి జీవించడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు. కొట్లాడుకుంటూ కలిసి ఉండటం కన్నా, విడిపోయి సంతోషంగా ఉండాలని భావిస్తున్నారు.
పాట పాడి భార్యను అక్కున చేర్చుకున్న భర్త
కారణాలు ఏంటో తెలియదు. కానీ, ఓ మహిళ కూడా తన భర్తతో వేగలేక విడాకులు కావాలని కోర్టుకు ఎక్కింది. న్యాయమూర్తి కేసు విచారణ మొదలు పెట్టాడు. తన భర్త సరిగా చూసుకోవడం లేదని చెప్తున్నప్పటికీ.. ఆమె మాటల్లో అతడి మీద ప్రేమ కురిపిస్తూనే ఉంది. విడిపోవాలని డివోర్స్ కోసం అప్లై చేసినా, కలిసిపోవాలనే ఆలోచనే ఉన్నట్లు న్యాయమూర్తి గమనించారు. ఎలాగైనా వారిని కలపాలని భావించారు. సంసారం అన్నా, చిన్న చిన్న మనస్పర్థలు కామన్ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Read Also: గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
ఇదే సమయంలో ఆమె భర్త చక్కగా పాటలు పాడుతారని తెలుసుకున్నాడు. వెంటనే, అతడిని భార్య కోసం ఓ పాట పాడాలని చెప్పాడు. న్యాయమూర్తి చెప్పడంతో వెంటనే ‘బద్లాపూర్’ సినిమా నుంచి సచిన్ జిరగ్ స్వరపరిచిన ‘జీనా జీనా’ అనే పాటను పాడారు. తన భర్త పాటకు ఆమె మనసు కరిగిపోయింది. వెంటనే తన భర్త భుజం మీద వాలిపోయింది. కోర్టులోని వాళ్లంతా చప్పట్లు కొడుతూ వారిని ఒక్కటి చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య మనసు అలాగే ఉంటుంది అంటూ అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. భార్య కోసం పాట పాడి మళ్లీ ప్రేమలో పడేసిన భర్తను అభినందిస్తున్నారు. ఇకపై ఎలాంటి మనస్ఫర్థలు లేకుండా జీవించాలని సూచిస్తున్నారు.
Wife files for #Divorce , husband sings , she falls in love again and no Alimony pic.twitter.com/CAeZtnc9Mh
— Vishal (@VishalMalvi_) March 19, 2025
Read Also: ట్రాఫిక్ పోలీసులకు గోరింటాకు పెట్టిన అమ్మాయి.. ఎర్రగా పండితే ఏం చేస్తుందట?