BigTV English

Egg Veg or Non Veg: గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Egg Veg or Non Veg: గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

కొన్ని అంశాల గురించి ఏండ్ల తరబడి ఆసక్తికర చర్చలు జరుగుతాయి. చివరకు ఎవరో ఒకరు ఆ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ సమాధానం నూటికి నూరుపాళ్లు వాస్తవం అయి ఉండకపోవచ్చు. కానీ, లాజికల్ గా కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఓ చర్చ, దాని సంబంధించిన సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


గుడ్డు శాకాహారమా? మాంసాహారమా?

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. గుడ్డు విషయంలో చాలా కాలంగా  ఓ బలమైన చర్చ జరుగుతుంది. అందులో ప్రధానమైనది.. గుడ్డు శాకాహారమా? మాంసాహారమా? అనే ప్రశ్న.


భారత్ లో గుడ్డును చాలా మంది శాకాహారంగానే భావిస్తారు. ప్రభుత్వం కూడా గుడ్డును తినాలని ప్రోత్సహిస్తుంది. ఆయా ప్రకటనల్లోనూ గుడ్డును శాకాహారంగా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లు గుడ్డు నిజంగానే శాకాహారమా? అంటే.. నిజమే అంటున్నారు నిపుణులు. సైన్స్ ప్రకారం శాకాహారానికి ప్రత్యేకమైన డెఫినేషన్ ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారంగా పిలుస్తారు. ఈ కోణంలో చూస్తే గుడ్డును శాకాహారంగానే భావిస్తారు. గుడ్డును శాకాహారంగా భావించి తినే వారిని ఓవో వెజిటేరియన్స్ గా పిలుస్తారు.

ఇప్పటికీ మాంసాహారం అనే భావన!

దేశంలో కొంత మంది మాత్రం ఇప్పటికీ గుడ్డును మాంసాహారంగా భావిస్తారు. అందుకే చాలా మంది నీచు తినని వాళ్లు గుడ్డుకు దూరంగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే? గుడ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫలదీకరణం చెందే గుడ్డు. రెండు ఫలదీకరణం చెందని గుడ్లు. మొదటి వాటి నుంచి పిల్లలు వస్తాయి. రెండో వాటి నుంచి రావు. రెండో రకం గుడ్డు కేవలం తినడానికే ఉపయోగిస్తారు.

సైన్స్ ప్రకారం ఏం తేలిందంటే?

ఇంకా ఆలోచిస్తే.. కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది నాన్ వెజ్ కాదనే వాదనకూడా ఉంది. జంతువల నుంచి వచ్చే ప్రతి దాన్ని మాంసాహారంగా పిలువాల్సిన అవసరం లేదంటారు పలువురు నిపుణులు. దీనికి ప్రత్యక్ష ఉదాహారణ పాలు. పక్షి నుంచి వచ్చిన గుడ్డు నాన్ వెజ్ అయినట్లు అయితే, ఆవు, గేదె నుంచి వచ్చే పాలు కూడా నాన్ వెజ్ గానే భావించాల్సి ఉంటుందనే లాజిక్ అప్లై చేస్తున్నారు. సో, సైన్స్ ప్రకారం చూస్తే పాలకు, గుడ్డుకు పెద్ద తేడా లేదు. ఈ నేపథ్యంలోనే గుడ్డు కచ్చితంగా శాకాహారమే అనే కంక్లూజన్ కు వస్తున్నారు. సో, మీరు గుడ్డును శాకాహారంగా భావిస్తున్నారా? మాంసాహారంగా భావిస్తున్నారా? అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పేయండి!

Read Also: ఫ్రిజ్ లో కుక్కతల.. బాబోయ్.. అక్కడ మోమోస్ తిన్నారో మీ పని అంతే!

Tags

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×