BigTV English

Lion Viral Video: సింహం నోట్లో బుడ్డోడి తల.. అబ్బో తినేద్దామనే.. పిల్లాడి ధైర్యం చూశారా?

Lion Viral Video: సింహం నోట్లో బుడ్డోడి తల.. అబ్బో తినేద్దామనే.. పిల్లాడి ధైర్యం చూశారా?

Lion Viral Video: : ఇటీవల సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే తెలిసిపోతుంది. వైరల్ వీడియోలు లక్షల మంది వీక్షిస్తున్నారు. కొన్ని వీడియోలకు అయితే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా హైప్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే.. ఇంట్రెస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఫన్నీ వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అలాగే నెటిజన్లు వీడియోల కింద చేసే కామెంట్స్ మరింత ఫన్నీగా ఉంటున్నాయి. అయితే తాజాగా ఓ బుడ్డోడిపై సింహం అటాక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.


చైనాలోని ప్రసిద్ధి గాంచిన షెన్‌యాంగ్ జూలో సింహాలను చాలా దగ్గరనుంచి చూసేందుకు పర్యాటకులు క్యూకడుతుంటారు. అయితే ఓ బుడ్డోడిని సింహం గాజు గోడ మధ్యలో నుంచి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బుడ్డోడు జూలో గ్లాస్ లోపల కనిపిస్తున్న భారీ సింహాలను చూసి ఇంట్రెస్టింగ్‌గా వాటి దగ్గరకు వెళ్తాడు. అయితే అందులో ఓ మృగరాజు ఫుల్ ఆకలిగా ఉందో.. ఏమో.. ఆ బాలుడిని తినే ప్రయత్నం చేసింది. బాలుడి తలలో నోరు పెట్టినట్టు స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. మధ్యలో గాజు పలక ఉన్నప్పటికీ ఆ దృశ్యం చూడడానికి కొంత భయంకరంగా ఉంది.

ALSO READ: SSC: 14,582 ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా మిత్రమా, ఇంకా కొన్ని రోజులే!


కానీ.. ఆ బుడ్డోడు మాత్రం కొంచెం కూడా భయపడలేదు. గాజు పలక బలంగా ఉండడం వల్ల ఆ సింహం ఏం చేయలేకపోయింది. బుడ్డోడు బెదరకుండా.. ధైర్యంగా ఆ సింహాన్ని చూస్తూ ఉండిపోయాడు. పిల్లాడి కుటుంబ సభ్యులు ఏం చక్కా ఆ కెమెరాలో వీడియో రికార్డ్ చేశారు. చూడడానికి భయానకంగా ఉన్న దృశ్యాన్ని మొబైల్‌లో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉత్తర చైనాలోని ఓ జూపార్క్ లో సింహం గాజు పలక ద్వారా చిన్నారిని తినేందుకు ప్రయత్నించింది అనే క్యాప్షన్ తో పోస్టు చేయగా.. అది విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల మంది నెటిజన్లు ఆ వీడియోను వీక్షించారు.

ALSO READ: Viral Video : కేదార్‌నాథ్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న యాత్రికులు.. వీడియో వైరల్

వీడియో చూసిన నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. గాజు పలక ఉండడం వల్ల బుడ్డోడు సురక్షితంగా ఉన్నాడు.. లేకుంటే ఏంటి పరిస్థితి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి కొందరు ఆ బుడ్డోడు వణకలేదు.. బెదరలేదు ఇది ధైర్యమంటే అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. గాజు పలక మధ్యలో ఉన్న ఆ దృశ్యం చూడడానికి కొంత భయానకంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో రెండేళ్ల కిందది అయినప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related News

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Big Stories

×