Angelo Mathews : ప్రస్తుతం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గాలే స్టేడియంలో తొలిటెస్ట్ జరుగుతోంది. తొలి టెస్ట్ లో మ్యాథ్యూస్ అటు అభిమానుల, ఇటు బంగ్లాదేశ్ క్రికెటర్ల మనస్సు గెలుచుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ వీడ్కోలు టెస్ట్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తరువాత రెడ్ బాల్ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడు మ్యాథ్యూస్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 495 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ప్రస్తుతం-శ్రీలంక 368 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. అయితే శ్రీలంక 204 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఇంతలో రెండో వికెట్ పడిన వెంటనే మ్యాథ్యూస్ బ్యాటింగ్ కి వెళ్లాడు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్స్ మ్యాథ్యూస్ కి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. కెప్టెన్ నజ్ముల్ శాంటో ఆధ్వర్యంలో ఆటగాళ్లందరినీ ఏకం చేసి చప్పట్లతో స్వాతం పలికారు. FGB
Also Read : Ashwin on Kohli : కోహ్లీ పరువు తీసిన అశ్విన్.. అతను లేకుండా మ్యాచ్ లు ఈజీగా గెలవచ్చు
మరోవైపు 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో మాథ్యూస్ కి టైమ్ ఇచ్చిన తొలి ఆటగాడిన మారినప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తంగా మారాయి. వరల్డ్ కప్ లో మాథ్యూస్ బ్యాటింగ్ కి వచ్చిన సమయంలో హెల్మెట్ పట్టి విరిగింది. అయితే మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాడు. ఆ సమయంలో కొంత ఆలస్యంగా గ్రౌండ్ కి రావడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ పై ఔట్ గా అప్లై చేశారు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ప్రస్తుత కెప్టెన్ నజ్ముల్ శాంటో తో కలిసి అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఫలితం వారికి అనుకూలంగా లభించింది. సమయం చూసిన అంఫైర్ మాథ్యూస్ ని ఔట్ గా ప్రకటించాడు. ఆ సమయంలో మాథ్యూస్ అంఫైర్ తో కూడా గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు బంగ్లాదేశ్ పై శ్రీలంక అభిమానులు కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. ఇక ప్రధానంగా షకీబ్ శ్రీలంకలోకి ప్రవేశించాలనుకుంటే చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి.
ఇక ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మాథ్యూస్ కి చప్పట్లతో స్వాగతం పలకడం.. అతని రిటైర్మెంట్ కానుండటంతో మ్యాథ్యూస్ కి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ బుద్ది తెచ్చుకుందని.. మాథ్యూస్ రిటైర్మెంట్ కి ఘనంగా వీడ్కోలు పలికారని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈవెంట్లలో మాథ్యూస్ ని ముష్పికర్ రహీమ్, నజ్ముల్ కౌగిలించుకున్నారు. రిటైర్ అవుతున్నటువంటి శ్రీలంక స్టార్ మాథ్యూస్ కి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వీరు మాథ్యూస్ కి ఇవ్వడమే మొదటి సారి కాదు. అంతకు ముందు రాస్ టేలర్ కి కూడా చివరి టెస్ట్ ఆడటంతో గార్డ్ ఆఫ్ హానర్ ని అందించారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందే శ్రీలంక ఆటగాళ్లు మాథ్యూస్ కి ప్రత్యేక గౌరవాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో మాథ్యూస్ 69 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా శ్రీలంక 127 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది.
From the controversial ‘timed out’ dismissal to a guard of honour in his farewell Test — what a turnaround! 🇱🇰⏱️❌
A classy gesture by the Bangladesh players for Angelo Mathews! 🇧🇩👏#AngeloMathews #SLvBAN #Tests #Sportskeeda pic.twitter.com/ZpJ69lSYEH
— Sportskeeda (@Sportskeeda) June 19, 2025