BigTV English

SSC: 14,582 ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా మిత్రమా, ఇంకా కొన్ని రోజులే!

SSC: 14,582 ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా మిత్రమా, ఇంకా కొన్ని రోజులే!

SSC Notification: 14వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిసేంది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇది గుడ్ న్యూస్. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భారీ సాలరీ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగ వెకెన్సీలు, విద్యార్హతలు, జీతం, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 ఏడాదికి గాను కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL)నోటిఫికేషన్‌ రిలీజైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు,  పలు సంస్థలలో 14,582 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత  ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: MECL Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, అప్లై చేస్తే జాబ్.. జీతం రూ.55,900


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య:  14,582

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్ కమ్ ట్యాక్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, సెక్షన్ హెడ్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగాలు – అందులో వెకెన్సీలు:

1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
2. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
3. ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్
4. ఇన్‌స్పెక్టర్, (సెంట్రల్ ఎక్సైజ్)
5. ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
6. ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
7. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
8. సబ్ ఇన్‌స్పెక్టర్
9. ఇన్‌స్పెక్టర్ పోస్టులు
10. ఇన్‌స్పెక్టర్
11. సెక్షన్ హెడ్
12. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
13. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
14. రీసెర్చ్ అసిస్టెంట్
15. డివిజనల్ అకౌంటెంట్
16. సబ్ ఇన్‌స్పెక్టర్
17. సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
18. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
19. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II
20. ఆఫీస్ సూపరింటెండెంట్
21. ఆడిటర్
22. అకౌంటెంట్
23. అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
24. పోస్టల్ అసిస్టెంట్/సోర్టింగ్ అసిస్టెంట్
25. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్‌లు
26. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
27. ట్యాక్స్ అసిస్టెంట్
28. సబ్-ఇన్‌స్పెక్టర్

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి ఏదైనా గుర్తింపు పొందిన  యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ పోస్టులకు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్ లో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ లో పాసై ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్  2025 ఆగస్టు 1 నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల  మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 9

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 4

ఫీజు చెల్లింపుకు లాస్ట్ డేట్: 2025 జూలై 5

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.

వయస్సు: 2025 ఆగస్ట్ 1 నాటికి వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది.  పే లెవల్-7 నెలకు (రూ.44,900 – రూ.1,42,400) జీతం ఉంటుంది. పే లెవల్-6 నెలకు (రూ.35,400 – రూ.1,12,400) జీతం ఉంటుంది. పే లెవల్-5 నెలకు  (రూ.29,200 – రూ.92,300) జీతం ఉంటుంది. పే లెవల్-4 నెలకు (రూ.25,500 – రూ.81,100) జీతం ఉంటుంది. అ

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ, మహిాళా, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఉద్యోగ ఎంపిక విధానం: టైర్ -1 సీబీటీ అబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. టైర్ -2 సీబీటీ అబ్జెక్టివ్ పరీక్ష, స్కిల్ టెస్ట్ లు ఉంటాయ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.

టైర్ -1 పరీక్ష: 2025 ఆగస్టు 13- 30 మధ్య ఉంటాయి.

టైర్-2 పరీక్ష: 2025 డిసెంబర్ లో ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: దేశవ్యాప్తంగా అన్ని జోన్ లలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ లలో ఎగ్జామ్స్ ఉంటాయి.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: MIL Recruitment: వారికి గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్, కాంపిటేషన్ చాలా తక్కువ భయ్యా

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14582

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 4

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×