బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో వింత వింత విషయాలు ఉంటాయి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజం అవుతూ ఉన్నాయి. తాజాగా బ్రహ్మం గారు చెప్పినట్లుగా వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ రాలుతున్నాయి. శ్రీరామ నవమి నుంచి ఈ వితం ఘటన జరగడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇందతా శ్రీరాముడి మహిమగా ప్రజలు భావిస్తున్నారు. సదరు వేప చెట్టును దేవతగా భావిస్తూ, పూజలు చేస్తున్నారు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన వాక ఏడు కొండలు ఇంటి ముందు ఓ వేప చెట్టు ఉంది. ఈ చెట్టు నుంచి గత మూడు రోజులు పసుపు, కుంకుమ పడుతుందంటున్నారు స్థానికులు. ఆదివారం శ్రీరామ నవమి నాటి నుంచి ఇలా జరుగుతుందంటున్నారు. ఇది ముమ్మాటికీ దైవ కార్యమేనని గ్రామస్థులు భావిస్తున్నారు.
వేప చెట్టు దగ్గగ గ్రామస్తుల భజనలు
పసుపు, కుంకుమ పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు వేప చెట్టును మహిమ కలిగిన వేప చెట్టుగా భావిస్తున్నారు. తాజాగా ఆ చెట్టు దగ్గర గ్రామస్తులంతా కలిసి భజనలు చేశారు. శ్రీరాముడే ఈ పని చేయిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఆలయం నిర్మించే విషయం గురించి ఆలోచిస్తామంటున్నారు.
వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ ప్రచారం..!
బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో ఘటన
స్థానికుడు వాక ఏడుకొండలు ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ గత మూడు రోజులుగా ప్రచారం
ఆదివారం శ్రీరామనవమి నాటి నుంచి ఇలా పడుతుందని, అది దైవ కార్యమేనని… pic.twitter.com/mpjnfpQpuy
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2025
Read Also: ఈ పక్షులు ఎగురుతూ నిద్రపోతాయట.. మరి దారి ఎలా తెలుస్తుంది?
ఆకతాయిల పని అంటున్న మరికొంత మంది!
అటు వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందనే వాదనలో ఎలాంటి నిజం లేదంటున్నారు మరికొంత మంది. అదంతా కేవలం కొంత మంది ఆకతాయిలు చేసిన పనిగా కొట్టి పారేస్తున్నారు. వేప చెట్టు మొదటి మీద ఎవరో కుంకుమ, పసుపు చల్లారే తప్ప, చెట్టు నుంచి నిజంగా రాలడం లేదంటున్నారు. ఈ ఆధునిక యుగంలో ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలను పట్టుకుని వేలాడటం మంచిది కాదంటున్నారు.
అసలు నిజాలు తేల్చాలంటున్న మరికొంత మంది గ్రామస్తులు
ఈ వ్యవహారం అధికారులు, అభ్యుదయ వాదులు స్పందించాలని మరికొంతమంది గ్రామస్తులు కోరుతున్నారు. అదంతా కేవలం కొంత మంది యువకులు చేసిన పనిగా నిరూపించాలని కోరుతున్నారు. అధికారులు కూడా ప్రజల్లో ఇలాంటి ఘటలన మీద అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుంది అనగానే జనాలు ఏం ఆలోచించకుండా పూజలు చేస్తూ, తమ అమాయకత్వాన్ని చాటుకుంటున్నారని చెప్తున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి అసలు నిజాలను తలే్చాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు, కుంకుమ రాల్చే వేప చెట్టు వ్యవహారం బాపట్ల పరిసరాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి మరీ రీల్స్.. నాగర్ కర్నూల్ కుర్రాళ్ల వెర్రి చేష్టలు!