Akkada Ammayi Ikkada Abbayi: ప్రముఖ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా తర్వాత ఇప్పుడు మళ్లీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రదీప్ మాచిరాజు హీరోగా, దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్ గా భరత్ – నితిన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ బిజినెస్ లెక్కలు..
మ్యాంక్స్& మంకీస్ బ్యానర్ పై దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలకు కాబోతోందని అందరూ అనుకున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం కేవలం రూ.2కోట్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ హక్కుల కోసం కేవలం రూ.2కోట్లు మాత్రమే మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చిందని సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ప్రదీప్ వ్యాల్యూ ఇంతేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సినిమా కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి.. కలెక్షన్లు పెరిగితే అప్పుడు మైత్రి మూవీ మేకర్స్.. మూవీ నిర్మాతలకు ఇంకాస్త డబ్బు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ప్రదీప్ మాచిరాజు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Tamannaah Bhatia: నేను సింగిలే… రిలేషన్‌షిప్‌పై తమన్నా ఓపెన్ కామెంట్..!
ప్రదీప్ మాచిరాజు సినిమాలు..
ఇక ప్రదీప్ మాచిరాజు విషయానికి వస్తే.. బుల్లితెరపై సుమా ఫిమేల్ యాంకర్స్ లో ఎంత పేరైతే సొంతం చేసుకుందో.. ప్రదీప్ మేల్ యాంకర్స్ లో అంతే పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈయన.. అక్కడ తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక అంతేకాదు ప్రదీప్ ఈమధ్య మిగతా చానల్స్ లో ప్రసారమవుతున్న షోలలో కూడా పాల్గొని అలరిస్తున్న విషయం తెలిసిందే. అంతలా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయనకు వెండితెర బాక్స్ ఆఫీస్ వద్ద మార్కెట్ కేవలం రూ.2 కోట్లతో వ్యాల్యూ కట్టడంపై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి తన వ్యాల్యూ ని పెంచుకొని అందరి కళ్ళు తెరిపిస్తారేమో చూడాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రదీప్ ఈమధ్య కాలంలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతకుముందు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అలరించారు. ముఖ్యంగా 100% లవ్, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలలో తన కామెడీతో ఆకట్టుకున్నారు.. ఇక ఇప్పుడు ప్యూర్ రొమాంటిక్ లవ్ డ్రామాగా వస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రదీప్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.