BSY : బయ్యా సన్నీ యాదవ్. నెల రోజులుగా మిస్సింగ్. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అరెస్ట్ చేసిందంటూ వార్తలు. పాక్ కోసం సన్నీ స్పై చేస్తున్నాడంటూ విమర్శలు. అయితే, అతను నిజంగా ఎన్‌ఐఏ అదుపులో ఉన్నాడా లేదా? అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. సన్నీ తండ్రి సైతం తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇదే ఛాన్స్‌గా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయాడు. BSYతో ఆయనకు పాత పగలు చాలానే ఉన్నాయి. అన్వేష్ దేశ ద్రోహి అని.. పాకిస్తాన్ స్పై అంటూ వీడియోలు పెట్టాడు. లేటెస్ట్‌గా సన్నీయాదవ్ నిజంగానే ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా? అంటూ అనుమానమూ వ్యక్తం చేశాడు. అన్వేష్ ఆ వీడియో పెట్టిన కొన్ని రోజుల్లోనే.. నేనొచ్చేశా అంటూ బయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది.
సింహాచలంలో సన్నీ..
యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్ సింహాచలంలో కనిపించాడు. నేనొచ్చేశానంటూ అన్వేష్ టార్గెట్‌గా పోస్ట్‌లు పెట్టాడు. వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతానంటూ పోస్ట్ చేశాడు. నువ్వు టెన్షన్ పడకు అంటూ అన్వేష్‌కి కౌంటర్ ఇస్తూనే.. బూతులు తిడుతూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారని.. ఇప్పుడే విడిచిపెట్టారని రాసుకొచ్చారు. వచ్చే నాలుగు రోజులు తనకు ఎంతో కీలకమని చెప్పారు. రెడీ టు ఫేస్ ఎవ్రీ థింగ్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
అన్వేష్‌పై అటాక్
నీ ఊరికొచ్చా.. నీ ఇంటికొచ్చా.. అంటూ అన్వేష్‌కు సన్నీ యాదవ్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడా? మీ పేరెంట్స్‌ను కలుస్తానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? నువ్వు టెన్షన్ పడకు అంటూనే అన్వేష్‌ను టెన్షన్ పెడుతున్నాడా? అసలు బయ్యా సన్నీ యాదవ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నట్టు? ఎన్ఐఏ కస్టడీకి తీసుకుందనే ప్రచారం నిజమేనా? చెన్నైలో అరెస్ట్ అయితే సింహాచలంకు ఎందుకు వెళ్లినట్టు? వైజాగ్‌లో అన్వేష్ ఇంటికి వెళ్లి ఏం చేస్తాడు? అంతా ఏదో డ్రామా నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : సైకిల్‌పై నుంచి పడిపోయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
పాక్‌కు స్పై..?
ఇటీవల బైక్‌పై పాకిస్తాన్‌కి వెళ్లివచ్చాడు సన్నీయాదవ్. ఆ వీడియోలు వరుసగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పాక్ గూఢచారిగా పని చేసి.. మన సైనిక రహస్యాలు పాక్‌కు చేరవేసిందని గుర్తించారు. జ్యోతి కాకుండా ఇంకా ఎవరెవరు పాక్ కోసం పని చేశారని ఆరా తీస్తుండగా.. బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోలు కనిపించాయి. అదే సమయంలో పాక్ నుంచి తిరిగి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో సన్నీని NIA అధికారులు అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతంలో విచారిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. పాక్‌లో 2 నెలల పాటు ఏం చేశావంటూ సన్నీ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నట్టు లీకులు వచ్చాయి. అప్పటి నుంచి సుమారు నెల రోజులుగా సన్నీ ఆచూకీ తెలీకుండా పోయింది.
NIA ఎంక్వైరీ నిజమేనా?
నిజంగానే ఎన్ఐఏ అన్ని రోజుల పాటు విచారించిందా? ఎంక్వైరీ మేటర్ నిజమే అయితే మీడియాకు అధికారికంగా ఎందుకు ప్రకటన రిలీజ్ చేయలేదు? స్టేట్ పోలీసులకు కానీ, పేరెంట్స్‌కు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అసలు ఆ లీక్ ఇచ్చింది ఎవరు? ఇలా అనేక డౌట్స్ ఉన్నాయి. సన్నీయాదవ్‌ను NIA అరెస్ట్ చేసిందనేదీ అనుమానాస్పదంగానే ఉంది. అంతా డ్రామా అనే వాళ్లు కూడా ఉన్నారు. ఆ ఎపిసోడ్‌ను అన్వేష్ సైతం బాగానే వాడేసుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు బయ్యా బయటకు వచ్చాడు. విమానంలో వైజాగ్‌లో దిగాడు. సింహాచలం ఆలయం ముందు ఫోటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పనిలో పనిగా అన్వేష్‌కు నీ ఇంటికొస్తున్నా అంటూ దమ్కీ ఇచ్చాడు. ఇకనుంచి సన్నీ వర్సెస్ అన్వేష్.. రచ్చ మామూలుగా ఉండదు. ఫాలోయర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. గెట్ రెడీ…
సింహాచలంలో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్
నేనొచ్చేశానంటూ అన్వేష్ టార్గెట్‌గా పోస్టులు పెట్టిన సన్నీ.
వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా.. మీ అమ్మానాన్నకి ధైర్యంగా చెబుతానంటూ అన్వేష్ని ఉద్దేశించి పోస్ట్.
నువ్వు టెన్షన్ పడకు అంటూ అన్వేష్‌కి సన్నీ కౌంటర్. ఇటీవలే బైక్‌పై పాకిస్థాన్… pic.twitter.com/DLpmyZdmvR— ChotaNews App (@ChotaNewsApp) June 17, 2025