MLA Raja Singh: తాను ఓ మామూలు కార్యకర్తనని.. ఎమ్మెల్యే రాజాసింగ్ సీనియర్ నాయకుడని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ పై ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు మాట్లాడినప్పుడు, వారి సలహాలను తప్పకుండా మేం వింటాం. వారి మాటలను పరిగణలోకి తీసుకుని చర్చిస్తాం. వాళ్లంతా పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లే.. మేమంతా మామూలం సాధారణ కార్యకర్తలం’ అని కిషన్ రెడ్డి సెటైరికల్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే.
అయితే.. దీనిపై బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నా గురించి ఈ విధంగా మాట్లాడారు ‘రాజా సింగ్ ఒక సీనియర్ నాయకుడు, నేను కేవలం పార్టీలో ఉన్న ఒక సామాన్య కార్యకర్తను”అని అన్నారు. అలాగే.. ‘రాజా సింగ్ ఏమి చెబితే దాన్ని మేము పాటిస్తాం’ అని కూడా అన్నారు. అందరికీ తగిన గౌరవాన్ని ఇస్తూ.. ఈ విషయంపై స్పందించాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు. ‘నా ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉంటుంది. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. నేనెప్పుడూ వ్యక్తిగత లబ్ధి లేదా పదవుల కోసం పని చేయలేదు. నా కృషి ఎప్పుడూ పార్టీని బలోపేతం చేయడం. దాని ఆదర్శాలను అంకితభావంతో పని చేయడంపై దృష్టి పెట్టాను’ అని చెప్పారు.
ALSO READ: DSP Wife: డీఎస్పీ భార్య ఇలా చేయొచ్చా.. బర్త్‌డే వేడుకల కోసం ఏకంగా, వీడియో వైరల్
అయితే.. కొంతమంది సీనియర్ నేతలు తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ఎలా విజయం సాధించాలని ఆలోచన చేయకుండా.. నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని.. అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినప్పటికీ నేను పార్టీకి అంకితమైన, నిస్వార్థ సేవ చేశాను. నేను ఓ ప్రశ్న వేస్తున్నాను. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? దయచేసి ఆలోచన చేయండి. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం? నేను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగానే మాట్లాడు. ఈ రోజు, నేను నా కోసం కాకుండా, పార్టీ ఐక్యతతో పనిచేస్తున్న లక్షలాది కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ALSO READ: DRDO: డీఆర్‌డీవో నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ ఉద్యోగం వస్తే రూ.లక్ష జీతం.. లాస్ట్ డేట్?
ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.. ‘కిషన్ రెడ్డి గారు.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మీతో వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం.. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా కలవాలని నిర్ణయించుకుంటే.. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలు చెప్పుకునేందుకు కిషన్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరుతున్నాను. విభజించడానికి కాదు.. ఐక్యతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మన పార్టీ నిజమైన లక్ష్యాన్ని ఎన్నటికీ మరచిపోకూడదు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరం. ప్రజలకు మనపై పాజిటివ్ ఓపీనియన్ ఉంది. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి, ఐక్యంగా పని చేద్దాం’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.