Childless Women Pregnant Scam| కష్టపడితే వచ్చే సంపాదన కంటే ఈజీగా మోసం చేసి దోచుకుందామనే ఆలోచనతో కొంత మంది తమ తెలివి తేటలను అక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఎవరూ ఊహించని పథకం మొదలుపెట్టారు. సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ఆశలు చూపించి సామాన్య యువకులను ట్రాప్ చేసేవారు. ఆ తరువాత వారి నుంచే డబ్బుల లాగేవారు. బాధితులు కూడా బయట ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయేవారు. కానీ ఓ బాధితుడు వారి ఆటకట్టించాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రం నవాడా జిల్లాకు చెందిన ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్ త్వరగా డబ్బులు సంపాదించడానికి ఒక ప్లాన్ వేశారు. ‘ఆల్ ఇండియా ప్రెగ్నింగ్ జాబ్ సర్వీస్’ పేరుతో దుకాణం పెట్టారు. ఈ కంపెనీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కేవలం ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే ప్రకటనల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రకటనల ప్రకారం.. సంతానం లేకుండా బాధపడే మహిళలతో శృంగారం చేసి వారిని గర్భవతులను చేస్తే.. ఆ యువకులకు తగిన బహుమానం ఇవ్వబడుతుంది.
Also Read: దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
దీనికి రేట్లు కూడా పెట్టారు. ప్రెగ్నెంగ్ చేయడానికి ఒకసారి హోటల్ రూమ్‌కు వెళితే.. రూ.50,000.. లేదా సదరు మహిళను గర్భవతి అయ్యేవరకు వెళితూ ఉంటే మరో విధంగా ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజీ ప్రకారం.. రెండు నెలల్లో గర్భం దాల్చితే రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ సమయం పడితే రూ.10 లక్షలు. ఈ ప్రకటనలు చదివి బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందని చాలా మంది యువకులు వారి ఫోన్ నెంబర్లక కాల్ చేస్తారు. ఆ తరువాత ఈ ముగ్గురు మోసగాళ్లు వారి నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.2000 నుంచి రూ.5000 తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, ప్యాన్ కార్డ్ ఇలా అన్నీ వివరాలు సేకరిస్తారు.
అంతా ఆన్ లైన్, ఫోన్ లోనే వ్యవహారం నడుస్తుంది. కానీ ప్రెగ్నెంట్ సర్వీసు పేరుతో చేసేది వ్యభిచారం. అదెలాగంటే వీరు యువకులతో వ్యభిచారం చేయిస్తున్నారు. వీళ్లు మరోవైపు నగరాల్లోకి పెద్ద క్లబ్బుల్లో మెంబర్లుగా ఉండే హై సొసైటీ మహిళలకు యువకులను సప్లై చేస్తారు. ఒక హోటల్ బుక్ చేసి అక్కడికి.. తమ వద్ద ప్రెగ్నెంట్ సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకున్న యువకులను పంపిస్తారు. ఇందులో ఆ యువకుల నుంచి హోటల్ బుకింగ్ పేరుతో చార్జీలు వసూలు చేస్తారు. తీరా ఆ యువకుడితో పని అయిపోయాక అతడికి ఏమీ ఇవ్వరు. ఒక నెల పూర్తి అయ్యాక డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి.. అతడికి తెలియకుండానే అతడితో హై టెక్ వ్యభిచారం చేయిస్తారు. ఆ తరువాత తమకు డబ్బులు చెల్లించమనే యువకుల ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తారు. తీరా ఆ యువకుడు అప్పుడు తాము మోసపోయామని గ్రహించి.. ఏమీ చేయక ఉండిపోతారు.
అయితే ఈ గ్యాంగ్ బాధితుల్లో ఒకడు పోలీసులను సంప్రదించి.. ఆల్ ఇండియా ప్రెగ్నింగ్ జాబ్ సర్వీస్ గురించి ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత పోలీసులు ఆ గ్యాంగ్ సభ్యుల ఫోన్ నెంబర్లు ట్రాక్ చేస్తే.. వారంతా కహువారా అనే గ్రామం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిసింది. దీంతో నవాడా జిల్లా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్స్, లాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో వాట్సప్ చాట్స్, కస్టమర్ల ఫొటోలు, వారి ఆడియో రికార్డింగ్స్, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు నవాడా జిల్లా డెప్యూటీ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇమ్రాన్ పర్వేజ్ తెలిపారు.