BigTV English

Tourist Selfie Train: పరుగులు తీస్తున్న ట్రైన్‌లో రీల్స్ షూటింగ్.. ప్రమాదవశాత్తు మహిళ మృతి?

Tourist Selfie Train: పరుగులు తీస్తున్న ట్రైన్‌లో రీల్స్ షూటింగ్.. ప్రమాదవశాత్తు మహిళ మృతి?

Tourist Selfie Train| ఈ కాలంలో అందరూ సెల్ఫీలు, సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం, వ్లాగ్స్ చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ అలవాటు వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వైరల్ వీడియోల మోజులో చాలామంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో తీయడానికి చైనాకు చెందిన మహిళ వేగంగా పరుగులు తీస్తున్న ట్రైన్ లో ప్రయత్నించింది. ఆమె నిర్లక్ష్యంగా ఉండడంతో ట్రైన్ లో నుంచి కిందపడింది. ఇది చూసి తోటి ప్రయాణికులంతా షాకయ్యారు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది.


బ్రిటన్‌కు చెందిన ది సన్ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. శ్రీలంకలో గత శనివారం ఒక ప్రమాదకర ఘటన జరిగింది. చైనాకు చెందిన యువతి తన స్నేహితులతో కలిసి శ్రీలంకలో పర్యటించడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె రైలు ప్రయాణం చేసింది. ఈ ప్రయాణం చేసే సమయంలో రైలు అందమైన సముద్ర తీరం నుంచి వెళ్లింది. అది చూసిన యువతి.. ఆ అందాల మధ్య ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలనుకుంది. అందుకే ట్రైన్ ద్వారాల వద్ద వేలాడుతూ పోజులిచ్చి నిలబడింది. అవతల ఆమె స్నేహితులు కెమెరాతో వీడియో తీసే పనిలో పడ్డారు.

సముద్ర తీరం నుంచి వచ్చే గాలులు, అక్కడి వాతావరణం ఆస్వాదిస్తూ.. ఆ యువతి ట్రైన్ ద్వారాలను రెండు చేతులతో పట్టుకొని బయటి వైపు తల వెనుక వాల్చి వేలాడుతూ పోజులివ్వడం ప్రారంభించింది. ఆ ఆహ్లాదకర వాతావరణానికి తోడు ఆమె అందమైన ముఖంపై ఆమె జుట్టు పడి గాలికి ఎగురుతూ ఉంటే.. ఆ అనుభూమి పొందుతూ ఆమె కళ్లు మూసుకొని ఆ క్షణం అజాగ్రత్తగా ఉంది. అదే ఆమె చేసిన తప్పు.


Also Read: సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో తల్లి.. ప్రమాదం అంచున పాప

రైలు పట్టాల పక్కనే ఆనుకొని కొన్ని చెట్లు ఉన్నాయి. ట్రైన్ ఆ చెట్లకు సమీపంగా వెళ్లడంతో ఆ చైనా యువతి తల ఒక్కసారిగా ఆ చెట్లకు తగిలింది. అంతే ఆ యువతి తనకు ఏం జరిగిందో తెలిసే సరికే ఆమె రెండు చేతులూ వదిలేసింది. దీంతో ఆమె ఆ చెట్ల పై నుంచి కిందపడింది.

ఇది చూసి ప్రయాణికులంతా షకయ్యారు. ఆమె బతికి ఉందో లేదో ఆందోళనలో పడ్డారు. అందుకే ట్రైన్ తదుపరి స్టేషన్ లో ఆగిపోతూనే ఆ చైనా యువతి స్నేహితులు పోలీసుల సాయంతో ఘటనా స్థలానికి వెళ్లారు. అదృష్టవశాత్తు ఆమె బతికే ఉంది. ట్రైన్ లో నుంచి కింద పడడంతో ఎముకలు విరిగాయేమోనని అందరూ భయపడ్డారు. అయితే ఆమెకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయని, ఆమె క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ వీడియో చూసిన వారింలో కొందరు ఆమె చాలా అదృష్టవంతురాలని కామెంట్లు పెడుతుంటే.. మరి కొందరు ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాశారు.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×