Tollywood Hero : టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ చేతినిండా సినిమాలతో దూసుకెళ్తుంటే, చాలామంది మిడ్ రేంజ్ హీరోలు ఇంకా ఒక్క హిట్టు కొట్టడానికే స్ట్రగుల్ అవుతున్నారు. ఎవరో ఒకరిద్దరు హీరోలు మినహాయించి మిగతా అందరూ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. అలాంటి వారి లిస్ట్ లో ఉన్న ఓ హీరో కొత్త సినిమాకి ఓటీటీ కష్టాలు మొదలయ్యాయనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో.
మిడ్ రేంజ్ హీరోకి దెబ్బ మీద దెబ్బ
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో వరుసగా ప్లాపులు అందుకుంటున్నాడు ఓ హీరో. అయినప్పటికీ ఈ హీరోకి అవకాశాలకు ఏమీ కొదవలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తున్న తాజా సినిమాకి ఓటీటీ కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. కొంతమంది సదరు హీరో సినిమాకి ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యిందని అంటుంటే, మరోవైపు మాత్రం డీల్ తగ్గించాలని ఓటీటీ సంస్థ ప్రపోజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇటీవల కాలంలో సినిమాల విషయంలో ఓటీటీ డీల్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ డీల్స్ ద్వారానే రిలీజ్ కంటే ముందే పెట్టుబడిలో సగానికి పైగా రాబడుతున్నారు నిర్మాతలు. అయితే కంటెంట్ హైప్ పెంచే విధంగా ఉందంటే ఓటీటీలు వాటి అంతట అవే భారీ డీల్స్ తో ముందుకు వస్తాయి. అయితే దీనికి హీరో మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని చూస్తారు. అలాగే సదరు హీరో వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న క్రమంలో ఓటిటి సమస్యలు మొదలయ్యాయని అంటున్నారు. మరి నిర్మాతలు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతారు అన్నది చూడాలి.
ఓటీటీ డీల్ పై హీరో ఇంపాక్ట్
ఓటీటీ డీల్స్ సెట్ కాకుండా రిలీజ్ కాని సినిమాలు లేవా అంటే ఉన్నాయి. కానీ మూవీకి ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది. తమ సినిమాపై, దాని కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటేనే గానీ నిర్మాతలు ఓటీటీ డీల్ సెట్ కాకుండానే సినిమాలను రిలీజ్ చేసే సాహసం చేయరు. ఇక ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా నిర్మాతలు తగ్గి, ఓటీటీ అడిగిన ధరకు సినిమా రైట్స్ అమ్మేస్తారా ? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : పాక్ నటితో సినిమానా? ప్రభాస్ మూవీపై ఆగ్రహావేశాలు.. ఇప్పుడు ఏం చేస్తారో?
మరోవైపు సదరు హీరో హిట్ అనే మాట విని చాలా కాలమే అవుతోంది. ఒకే ఒక్క హిట్ అంటూ వివిధ జానర్స్ లో సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవేమీ ఫలించలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కొత్త సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ మూవీతోనైనా ఆశించిన హిట్టును ఆ హీరో అందుకుంటాడా? అనేది చూడాలి.