Viral Video: ఫ్రీ బస్సు పథకం లేనప్పుడు అమ్మలక్కలు టిక్కెట్టు తీసుకుంటే.. ఇద్దరు కూర్చునే సీట్లో కూడా ముగ్గురు కూర్చునేది. ఏ ఊరు అక్కా ఏడికి పోతున్నావ్ అంటే.. మా అవ్వగారి ఇంటికి పోతున్నా అని ఒకళ్లు, మా కోడల్ని తీసుకూరాబోతున్నా అని ఇంకొకళ్లు మాట్లాడుకోని ప్రశాంతంగా పోయి.. ప్రశాంతంగా వచ్చేది. ఇంకా మళ్లా అదే సీట్లలలో చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకునేవారు.. కానీ ఇప్పుడు యెహే.. ఇప్పటికే ఇద్దరం కూర్చున్నాం సీటు అంతా నిండిపోయింది. ఫ్రీగానేగా.. మళ్లా వచ్చే బస్సులో రారాదని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ విషయం ఏంటంటే.. బస్సులో సీటు కోసం మొగోళ్లు, ఆడోళ్లు పొట్టు పొట్టు కున్నారు.
ఆర్టీసీ బస్సులో సీట్ కోసం మహిళలు, మగవాళ్లు ఘర్షణ పడిన ఘటన వేముల వాడ-సిద్దిపేట వెళ్లే రూట్లో ప్రయాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు జుట్టుపట్టుకుని కొట్టుకుంటూ.. రాళ్లతో పరస్పరం దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరకు తోటి ప్రయాణికులు, బస్సు కండెక్టర్ కలగజేసుకుని అతి కష్టం మీద వారిని చెదరగొట్టడంతో కథ సుఖాంతమైంది.
సీట్ల కోసం మహిళలు ఘర్షణలు పడటం, డ్రైవర్, కండెక్టర్లపై దాడులు చేయడం వంటవి నిత్యం ఏదొక చోట జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలలు కోట్లాటలు ఆగడం లేదు. ఇప్పటి వరకు మహిళలు కొట్టుకోవడమే చూశారు.. కానీ తాజాగా బస్సులో సీటు కోసం ఆడాళ్లు, మొగోళ్లు జుట్టుపట్టుకుని చితకొట్టుకున్నారు. కుస్తీ పోటీలకు పంపిస్తే.. కప్పు తీసుకొస్తారేమో అన్నట్టు కొట్టుకున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో విజయం కైసవం చేసుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. నిత్యం వేలాది మంది మహిళలు ఆధార్ కార్డు చూపించి, బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అడపాదడపా బస్సుల్లో కోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించగా, కొన్నిసార్లు బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సహనం కోల్పోతున్న మహిళలు పలు సందర్భాల్లో ఘర్షణలకు పాల్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితివరకు వెళ్తున్నారు.
Also Read: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్
అయితే.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మొదటి నుంచీ.. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మొదట ఆర్టీసీ బస్సు సిబ్బందిపై దాడులు, ఆ తర్వాత మహిళా ప్రయాణికులే ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవటం.. కొంతమంది బస్సులోనే రకరకాల పనులు చేస్తూ.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు వార్తలతో పాటు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫ్రీ బస్సులో ఆడోళ్ళు అడోళ్ళు కొట్టుకునేది చూశారు. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు కొట్టుకునేది చూస్తున్నారు ,
ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేవు pic.twitter.com/u4rfg4qXWc— 000009 (@ui000009) April 12, 2025