Betel Leaves: తమలపాకు తినడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం అని చెప్పవచ్చు. అనేక ప్రాంతాల్లో పాన్ తినే అలవాటు ఉన్న వారిని మనం చూస్తూనే ఉంటాం. ఆహారం తిన్న తర్వాత తీపి, సాదా పాన్ తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే తమలపాకు తినడం వల్ల కొన్ని రకాల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కూడా తమలపాకు మీకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా తమల పాకును ఔషదంగా ఉపయోగిస్తారు.
నిజానికి టానిన్ , ప్రొపేన్, ఆల్కలాయిడ్, ఫినైల్ వంటి పోషకాలు కూడా తమల పాకులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మరి తమలపాకు తినడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థ:
జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తమల పాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకులు ఆల్సర్ వంటి వ్యాధులను నయం చేయడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్యాస్ వంటి వాటిని తగ్గించడంలో కూడా తమల పాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
చిగుళ్లకు ప్రయోజనకరం:
చిగుళ్ల వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తమలపాకు తరచుగా నమలడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే పోషకాలు చిగుళ్ల వాపును తొలగిస్తాయి. అంతే కాకుండా పంటి సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.
దగ్గు నుండి ఉపశమనం:
దగ్గు సమస్యకు తమల పాకు సహజ నివారణగా కూడా పనిచేస్తుంది. అంతే కాకుండా తమలపాకులో ఉండే యాంటీ బయోటిక్స్ శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి. తమలపాకు కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు వల్ల కలిగే మంటను కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గిస్తుంది:
బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా తమలపాకు తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఈజీగా బరువు తగ్గడంలో తమలపాకు మీకు ఉపయోగపడుతుంది. తమలపాకులో ఉండే సమ్మేళనాలు జీవక్రియను పెంచుతాయి. అంతే కాకుండా ఊబకాయాన్ని కూడా వేగంగా నియంత్రిస్తాయి.
గొంతు నొప్పి:
తమలపాకు తరచుగా తినడం వల్ల గొంతు నొప్పి నుండి ఈజీగా బయటపడవచ్చు. జలుబు, దగ్గు నుండి బయటపడటానికి కూడా ఇది ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం:
తమలపాకు నమలడం ద్వారా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది అంతే కాకుండా గ్యాస్ సమస్యను రాకుండా చేస్తుంది. ప్రతి రోజు ఒక తమలపాకు తింటే మలబద్దకం సమస్య అస్సలు ఉండదు.
Also Read: ఎక్కువగా చెమట పడుతోందా ? అస్సలు లైట్ తీసుకోకండి !
మధుమేహం నుండి ఉపశమనం:
తమళపాకులో యాంటీ హైపర్లై సీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెక్కరను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను కూడా నివారిస్తాయి. డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్న వారు ఉదయం పేట ఖాళీ కడుపుతో తమలపాకు నమలడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.