Viral Video: టెక్ యుగంలో కొత్త కొత్త వింతలు బయటకు వస్తున్నాయి. అవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేవో తెలీదుగానీ.. కనిపిస్తున్న బల్లి నుంచి నుంచి ఫైర్ రావడం మొదలైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
మాయలు.. మంత్రాలు.. మనుషులకే కాదు.. జంతువులకు తెలుసు. అందుకు ఉదాహరణ పైన కనిపిస్తున్న బల్లి. అందులో స్పెషలేంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఇంట్లో పనులు చేసుకుంటూ పెరట్లోకి వెళ్లాడు ఓ వ్యక్తి. పెరట్లో అనేసరికి రకరకాల కీటకాలు, చిన్న చిన్న జంతువులు సైతం కనిపిస్తుంటాయి.
ఆ వ్యక్తికి బల్లి తోక నుంచి లైటింగ్ మాదిరిగా ఫైర్ రావడం కనిపించింది. తొలుత లైట్‌గా తీసుకున్నాడు ఆ వ్యక్తి. కాసేపు ఆ బల్లి వైపు తదేకంగా చూశాడు. ఇదేదో అరుదైనదిగా గుర్తించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన సెల్ ఫోన్‌లో దాన్ని బంధించే ప్రయత్నం చేశాడు కాంబోడియా వ్యక్తి.
ఆ బల్లి ఎటువైపు వెళ్లినా తోక నుంచి చిన్నదిగా టార్చిలైట్ తరహాలో లైటింగ్ రావడం గమనించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. నెటిజన్ల నుంచి మాంచి స్పందన వస్తోంది. కాంబోడియా వ్యక్తి ఇంకా ఏంచెప్పాడంటే.. తన ఇంటి వెనుక ప్రాంగణాన్ని అన్వేషిస్తున్నప్పుడు మంటలు చెలరేగుతున్న బల్లిని గుర్తించానని చెప్పాడు.
ALSO READ: పిల్ల సైంటిస్టులు.. డ్రింక్ బాటిల్స్‌తో రాకెట్ మేకింగ్
బల్లి గోడపై ప్రాకుతూ దాని తోకను ఊపుతూ ఉంటుంది. తోక చివర అకస్మాత్తుగా విద్యుత్ ప్రవాహంలాగా మంటలు చెలరేగుతున్నాయి. నెటిజన్లు ఈ అరుదైన బల్లిని పోకీమాన్‌తో పోల్చుతున్నారు. తోక నుండి నిప్పును వెలిగించే లక్షణాలను ‘చార్మండర్’ అని పిలుస్తారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. దానిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని పట్టుకుంటే బాగుందని కొందరు అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
A man in Cambodia films a strange lizard seemingly sparking fire from its tail. Nature or trick? pic.twitter.com/E2ce7iXkTS
— ViralRush ⚡ (@tweetciiiim) July 19, 2025