Intinti Ramayanam Today Episode july 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్క్ లో ప్రణతి, భరత్ లను చూసి పార్వతి రెచ్చిపోతుంది. నా కూతురితో తిరగొద్దని ఎంత చెప్పిన వినవేంటి.. కొంచెం కూడా నీకు సిగ్గు శరం లేదా అని పార్వతి భరత్ ను దారుణంగా తిడుతుంది. భరత్ ఎంత చెప్పినా వినకుండా రెచ్చిపోయి చెంప పగల గొడుతుంది. పల్లవి పదా అత్తయ్య తాను భరత్ ఎలాంటివాడో తెలుసుకుంటుంది మనం వెళ్ళిపోదాం పద అని అంటుంది.. ఇంటికి వచ్చిన భరత్ ని చూసిన అవని ఆ కట్టేంటి ఆ దెబ్బలు ఏంటి అని అడుగుతుంది. ఏమైందో చెప్పరా ఎవరికైనా గొడవపడ్డావా అని ఎంత అడిగినా భరత్ మాత్రం చిన్న యాక్సిడెంట్ అక్క అని లోపలికి వెళ్ళిపోతాడు. ప్రణతిని అవని అడుగుతుంది.. పార్కులో కూర్చొని ఉంటే మా అమ్మ వచ్చి గొడవ చేసింది వదిన అని నిజం చెప్పేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని భరత్ ను, పార్వతి ఎందుకు కొట్టింది అని ప్రణతిని అడుగుతుంది. మా పాటికి మేము కూర్చున్నాం వదిన అమ్మే వచ్చి పెద్ద రచ్చ చేసింది.. అక్షయ వింటే కచ్చితంగా మళ్ళీ గొడవవుతుంది అని ప్రణతిని పక్కకు తీసుకెళ్లి అవని మాట్లాడుతుంది. మీరెందుకు అత్తయ్య ను రెచ్చగొట్టారు అని టెన్షన్ పడుతుంది.. మిమ్మల్ని కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తీసుకురమంటే మీరు పార్క్ కి ఎందుకు వెళ్లారు అని అవని కూడా ప్రణతిని ప్రశ్నిస్తుంది.
అయితే ప్రణతి ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచడం కరెక్ట్ కాదు. నేను భరత్ ని ప్రేమిస్తున్నాను వదిన భరత్ అంటే నాకు ఇష్టం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి వదిన ఒకసారి నేను చేసిన తప్పుని మళ్ళీ చేయను. భరత్ అంటే నాకు చాలా ఇష్టం ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది అని ప్రణతి వెళ్లిపోతుంది. అవని టెన్షన్ పడుతూ ఇది ఎన్ని గొడవలకు కారణం అవుతుందో..? కచ్చితంగా నేనే నా తమ్ముని రెచ్చగొట్టి ప్రణతి నీ ప్రేమించమని చెప్పినట్లు అత్తయ్య అనుకుంటుంది.
అటు మావయ్య కూడా నా నమ్మకం నీ పోగొట్టావని బాధపడతాడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఉదయం ఈ విషయాన్ని ఎలాగైనా మావయ్యతో చెప్పాలి అని అవని అనుకుంటున్నారు. రాత్రి భరత్ ఒంటరిగా ఉండడం చూసి అవని ఏమైందని అడుగుతుంది. ఏం లేదు అక్కని భరత్ అన్న కూడా ప్రణతి నాకు మొత్తం నిజం చెప్పేసింది నువ్వు కూడా ప్రణతిని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. మొదట ప్రతి అంటే నాకు ఇష్టం లేదు అక్క తన మాటలతో తన కేరింగ్ తో నాకు తన మీద ఇష్టం కలిగింది.
ఇప్పుడు తను నాకు దూరమైతే బతకలేనేమో అనిపిస్తుంది కానీ భరత్ అనగానే అవని షాక్ అవుతుంది. ఇన్ని రోజులు అత్తయ్య అనుకున్నది నిజం చేశామని నన్ను అపార్థం చేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే మీ బావకు నాకు మనసు పెద్దలు తొలగిపోయి దగ్గరవుతున్నారు అనుకుంటున్నాను ఈ విషయం తెలిస్తే ఇక నాకు జీవితంలో దగ్గర కాలేరు అని అవని అంటుంది. అటు పల్లవి భరతు నిజమని ప్రణతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడానికి చెట్టు తోట నాకు ఉండి వింటూ ఉంటుంది.
అవని కచ్చితంగా జన్మలో ఇంటికి రాలేదు అని పల్లవి అనుకుంటుంది. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్యతో చెప్పాలి. అవని గురించి ఇంకాస్త రెచ్చగొట్టాలని పల్లవి అనుకుంటుంది.. ఇంటికి వెళ్లిన పల్లవి పార్వతి తో అత్తయ్య ఆ భరత్ ప్రణతి ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారు. భరత్ అవనితో చెప్పడం నేను విన్నాను అని అంటుంది.. అయితే పార్వతి అవని ఏమంటుంది అని అడుగుతుంది. నాకు తెలిసి అవని అక్కని వాళ్ళిద్దర్నీ దగ్గరుండి కలిసేలా చేసిందేమో అని అనుమానంగా ఉంది అత్తయ్య అని అంటుంది.
Also Read : రవి కోసం శృతి షాకింగ్ నిర్ణయం.. డబ్బుల కోసం మనోజ్ కొత్త అవతారం..
మనం మన ప్రణతిని ఇంటికి తెచ్చుకుంటే వాడికి దూరంగా ఉంటే అంతా మర్చిపోతారు అని ఒక ప్లాన్ చెప్తుంది. పార్వతి ఈ ప్లాన్ బాగుంది ఇదే మనం ఫాలో అవుదామని అంటుంది. అటు అవని వీరిద్దరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. స్వరాజ్యం ఈ విషయాన్ని మీ మామయ్యకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని అంటుంది. ఇదంతా నేను చేశాను అనుకుంటారు. ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న ఆయన ఇది తెలిస్తే శాశ్వతంగా దూరం అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..