Shruti Haasan: ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది శృతిహాసన్ (Shruti Haasan). ప్రభాస్ (Prabhas ) తో సలార్ (Salaar ) సినిమా తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ (Coolie ) సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఉపేంద్ర (Upendra), నాగార్జున(Nagarjuna) తో పాటూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2న విడుదల చేస్తామని.. డైరెక్టర్ లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టలేదు చిత్ర బృందం. కానీ శృతిహాసన్ మాత్రం తన వంతు పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంది.
వార్ 2 Vs కూలీ.. శృతిహాసన్ అదిరిపోయి రియాక్షన్..
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ కి.. కూలీ సినిమాతో పాటు అదే రోజు విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ వార్ 2 గట్టి పోటీ ఇస్తుందా? ఈ రెండు సినిమాల ఫలితాలు ఏంటి? అన్న ప్రశ్న ఎదురయ్యింది.దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. “గతంలో ‘సలార్’, డంకీ కూడా ఒకేసారి విడుదలయ్యాయి. ఆ చిత్రాల లాగే కచ్చితంగా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి” అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది శృతిహాసన్. మొత్తానికైతే ఈ సినిమాల విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి రెండు చిత్రాల మధ్య వార్ గట్టిగా ఉంటుంది అంటూ వార్తలు సృష్టించిన వారందరికీ ఈమె మాటలు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే
వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్..
ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR).. తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తున్నారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. కియారా అద్వానీ (Kiara advani).హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. మరి భారీ అంచనాల మధ్య ఒకేరోజు రెండు బడా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
ALSO READ:HHVM: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సరికొత్త కండిషన్.. వారికి నో ఎంట్రీ!