2 Stage Water Rocket: చైనాలో పిల్లలకు చిన్నప్పటి నుంచే శాస్త్రసాంకేతికత గురించి టీచర్లు బోధిస్తారు. వారిచేత ప్రయోగాలు కూడా చేస్తాయి. అందుకే, అక్కడి పిల్లలు ఇతర దేశాల పిల్లలతో పోల్చితే చాలా యాక్టివ్ గా ఉంటారు. చిన్నప్పటి నుంచే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా చైనా పిల్లలు చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలా బాటిల్స్ తో తయారు చేసిన రెండు స్టేజీల రాకెట్ ను తాజాగా ప్రయోగించి సక్సెస్ అయ్యారు. పిల్ల సైటిస్టులు అద్భుతం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండు-దశల వాటర్ రాకెట్ ప్రయోగం సక్సెస్
చైనీస్ పిల్లలు సాధారణ కోలా బాటిళ్లతో తయారు చేసిన రెండు-దశల నీటి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రియేటివ్ ప్రాజెక్ట్, ప్రొపల్షన్, స్టేజింగ్, ఏరోడైనమిక్స్ లాంటి ప్రాథమిక రాకెట్ సైన్స్ సూత్రాలను మీద కొనసాగుతుంది. తక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం పిల్లల్లోని అద్భుతమైన టాలెంట్ ను బయటపెట్టింది. ఈ నీటి రాకెట్ పిల్లలోని ఇంజనీరింగ్ ప్రతిబకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రాకెట్ ను ప్లాస్టిక్ కోలా బాటిళ్లతో తయారు చేశారు. ఈ రాకెట్ న్యూటన్ థర్డ్ లా ప్రకారం.. ఒత్తిడితో కూడిన నీటిని క్రిందికి చిమ్ముతూ రాకెట్ పైకి నెట్టబడింది. ఈ ప్రాజెక్ట్ రెండు స్టేజీలలో కొనసాగింది. నిజమైన అంతరిక్ష రాకెట్ లా కనిపించి ఆకట్టుకుంది. మొదటి దశ నీరు, వాయు పీడనంతో నిండి ఉంటుంది. ఇది రాకెట్ ను ఆకాశం వైపుకు నడిపిస్తుంది. నిర్దిష్ట ఎత్తులో రెండవ దశ విడిపోతుంది. ఆ తర్వాత కూడా వాయు ఒత్తిడితో మరింత ముందుకు వెళ్తుంది. రాకెట్ కిందికి సేఫ్ గా తిగేందుకు పారా చూట్ ను కూడా ఏర్పాటు చేశారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Ignite your space dream! With their science teacher guiding alongside, a group of children aged 7 to 12 from east China's Ji'an saw their self-built water rocket take to the sky recently. Source:People's Daily,China #SpaceDream #JiAn #WaterRocket #China pic.twitter.com/xEXGD19AnK
— Jining City (@JiningCity) July 17, 2025
మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి వీడియో
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. విద్యార్థుల కృషి, సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “అద్భుతం… చైనా ఎడ్యకేషన్ మోడలో మరో లెవల్ లో ఉన్నట్లు కనిపిస్తుంది” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “పిల్లలు ఎంతో చక్కని ప్రయోగం చేశారు. మంచి ఎడ్యుకేషన్ పొందడం వల్లే ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
భవిష్యత్ లో నీటి రాకెట్ల తయారీ?
ఈ ప్రత్యేక ప్రయోగం ఇటీవల ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని కూడా ఆకట్టుకుంది. అయితే, నీటి రాకెట్లు అనేది కొత్తవేమీ కాదు. 1990ల నుంచి అమెరికా, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులపై ప్రయోగాలు కొనసాగాయి. ఆ తర్వాత ఈ ప్రయోగాలను వదిలేశారు. తాజాగా ఈ విద్యార్థులు పాఠశాల పోటీల కోసం వాయు పీడన రాకెట్లను నిర్మించారు. ఈ ప్రయోగం మీద సైన్స్ నిపుణులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 25 సంవత్సరాలలో వేలాది నీటి రాకెట్ ప్రయోగాలను చూశానన్న రిటైర్ట్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్.. ఈ ప్రయోగం నిజంగా అద్భుతంగా ఉందన్నారు. కోలా బాటిళ్ల వంటి సులభంగా అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించడం ద్వారా, అర్థవంతమైన శాస్త్రీయ అన్వేషణకు ఎక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగశాలలు అవసరం లేదని నిరూపించారన్నారు. “వీళ్ల ఇంజనీరింగ్ ప్రతిభ ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే 10 ఏళ్లలో వాళ్లు ఏం చేస్తారో ఊహించుకోవచ్చు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Read Also: భార్య కంటే ఎత్తు కనిపించాలని సర్జరీ, అవసరమా బ్రో!