BigTV English

Viral Video : పామును నమిలి తింటున్న జింక.. వీడియో వైరల్

Viral Video : పామును నమిలి తింటున్న జింక.. వీడియో వైరల్

Deer Eat Snake : సాధారణంగా జింకలు శాకాహారులు. ఈ విషయం మనకు కూడా తెలుసు. ఎందుకంటే.. మనము కూడా వాటిని జూ పార్కులు, అటవీ ప్రాంతాల్లో చూసేఉంటాం అవి గడ్డిని చిన్నచిన్న మొక్కలను తినడం. కానీ జింకలు కూడా కొన్ని సందర్భాల్లో మాంసాహారులుగా మారతాయట. వాటి శరీరంలో కాల్షియం, ఉప్పు వంటి ఖనిజాలు లేనప్పుడు మంసాన్ని తింటాయట. అలానే మొక్కలు కూడా తక్కువగా ఉన్నప్పుడు ఇలా మాంసాన్ని తినడం జరుగుతుందట. ఇటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.


ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉంది. సుశాంత నంద అనే ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. సుశాంత నంద పేరుగాంచిన ఐఎఫ్ఎస్ అధికారి. జింక పామును తింటుండడంతో ఈ వీడియో ఎక్స్‌లో వైరల్‌‌‌గా మారింది.

Read More : భారీ పాముతో నిద్రిస్తున్న చిన్నారి..!

ఈ వీడియోలో జింక పామును తింటున్న ఘటనతో పాటుగా.. మంచి ప్రకృతిని చూడొచ్చు. వీడియోకు వ్యూస్ మిలియన్లలో ఉన్నాయి. కామెంట్‌లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. ఎక్స్‌లో ఈ వీడియోను 245.6 వేల మంది చూడగా.. 2155 లైక్‌లు వచ్చాయి. 543 రీట్వీట్‌లు కూడా ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Read More :  పిల్లి.. ఏమి స్టంట్లు కొట్టింది మామ..!

వీడియోను మరొక ఎక్స్ యాజర్ సైన్స్ గర్ల్ మళ్లీ షేర్ చేసింది. ఆమె జింకల గురించి మాట్లాడుతూ.. జింకలు శాకాహారులు మరియు వాటి రుమెన్ కారణంగా రుమినెంట్‌లుగా వర్గీకరించబడ్డాయి. ఇది సెల్యులోజ్ వంటి కఠినమైన మొక్కల పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ ఆహారం తక్కువగా ఉంటే లేదా కాల్షియం మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు లేకుంటే జింకలు మాంసాన్ని తింటాయని రాసుకొచ్చారు.

వీడియోను చూసిన చాలా మంది ఎక్స్ వినియోగదారులు నమ్మలేకపోతున్నారు. ఇది నిజంగా జరిగిందా అని కామెంట్ చేస్తున్నారు. వావ్.. ఈ అడవిలో ఇది చూడడానికి ఒక వింత దృశ్యమని మరొకరు కామెంట్ చేశారు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×