ఢిల్లీ మెట్రో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. మహిళలు గొడవవలు పడటం, యువకుల కొట్లాడు కోవడం, యువతులు రంగులు పూసుకుంటూ డ్యాన్సులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే..
మెట్రోలో యువతీ, యువకుల అసభ్య ప్రవర్తన
ఢిల్లీ మెట్రోకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఓ యువతీ యువకుడు పాడు పనుల చేస్తూ కనిపించారు. పక్కన తోటి ప్రయాణీకులు ఉన్నారనే సోయి లేకుండా హద్దులు మీరి ప్రవర్తించారు. విదేశాల్లో సబ్ వేలలో మాదిరిగా బహిరంగంగానే పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఆప్ఫెక్షన్ (PDA) చేసే స్థాయికి చేరుకున్నారు. ఈ యువ జంట ఢిల్లీ మెట్రోలో ఉన్నామననే విషయాన్ని మర్చిపోయి వ్యవహరించారు. తరచుగా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడంతో పాటు చేయకూడని పనులు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నిన్న కోల్ కతా.. నేడు ఢిల్లీ..
రీసెంట్ కోల్ కతా మెట్రోలో ఓ యువ జంట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఢిల్లీ మెట్రోలోనూ అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. ఒకరికొకరు దగ్గరగా కూర్చొని రొమాన్స్ చేస్తూ కనిపించారు. చుట్టు పక్కల ఉన్న వాళ్లు చూస్తున్నారని తెలిసినా, కొంత మంది వారిని వీడియో తీస్తున్నట్లు గమనించినా, సదరు జంట ముద్దులు పెట్టకునేందుకు ప్రయత్నించారు. ఆ అమ్మాయి యువకుడిని ఎక్కడెక్కడో తడుముతూ కనిపించింది. కాసేపటికి ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయంలపై క్లారిటీ లేదు.
యువ జంట తీరుపై నెటిజన్ల ఆగ్రహం
ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో Berlin (Parody) అనే అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ‘ఢిల్లీ మెట్రో మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు” అనే క్యాప్షన్ ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోపై దేశ వ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి రకరకాల స్పందన లభిస్తోంది. “ఢిల్లీ మెట్రో, న్యూయార్క్ సబ్‌వేలు ఒకేలా మారిపోయాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇక ఢిల్లీ మెట్రోను ఓయో రూమ్ లుగా మార్చితే బాగుటుంది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “కంటెంట్ కావాలంటే మీమ్ క్రియేటర్లు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తే సరిపోతుంది” అని మరొకరు రాసుకొచ్చారు. “ఈ ఇద్దరిని పట్టుకుని వెంటనే జైల్లో వేయాలి. లేకపోతే ఇలాంటి వాళ్లు రోజు రోజుకు పెరిగిపోతారు” అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: సంక్రాంతి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్, జనవరి నుంచి ఆ రైళ్లకు అదనపు కోచ్‌లు!