Captain’s Field Setup: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ని డ్రా చేసుకోవడానికి టీమ్ ఇండియాకు పూర్తి ఒక రోజు సమయం ఉంది. కానీ భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Also Read: Yashasvi Jaiswal: అంపైర్లు ఛీటింగ్.. వివాదంగా మారిన జైశ్వాల్ వికెట్ !
మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తో చెలరేగగా.. రెండు ఇన్నింగ్స్ లలో యశస్వి జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అటు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదయింది. టెస్ట్ క్రికెట్ లో పాట్ కమీన్స్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుట్ కావడం ఇది ఆరోసారి. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ లో ఒక కెప్టెన్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతిలో ఎక్కువ సార్లు అవుట్ అయిన రికార్డ్ రోహిత్ పేరిట నమోదయింది.
ఇదిలా ఉంటే.. ఈ నాలుగో టెస్ట్ లో భారత్ ఓటమి చెందడంతో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 ఆదిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన తనని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ మ్యాచ్ లో జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చాయని.. కానీ చేజర్చుకున్నామని తెలిపాడు. చివరి వరకు పోరాడాలనుకున్నాము కానీ కుదరలేదని తెలిపాడు. నితీష్ కుమార్ రెడ్డి, బూమ్రా అసాధారణ ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు.
“ఓ దశలో ఆస్ట్రేలియాని 90/6 కే పరిమితం చేశాం. కానీ పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనే కఠినమైన క్రికెట్ ఆడాలనుకున్నాం. కానీ మేము బాగా ఆడలేదు. నేను నా గదికి వెళ్లి ఈ మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. మేము ఎంతగానో పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు మా కంటే గట్టిగా పోరాడింది. ముఖ్యంగా ఆ చివరి వికెట్ భాగస్వామ్యం మాకు {Captain’s Field Setup} విజయాన్ని దూరం చేసింది. నాథన్ లియోన్ – బోలాండ్ చివరి వికెట్ కీ 61 పరుగులు జోడించడం మాకు చాలా నష్టం కలిగించింది.
సిడ్నీలో జరగబోయే ఐదవ టెస్ట్ తమకు ఓ అవకాశం. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం” అని పేర్కొన్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ టెస్ట్ లోని రెండవ ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా టీమ్ మొత్తం వికెట్లకు సమీపంలోనే ఫీల్డింగ్ చేశారు. లియోన్ బౌలింగ్ లో బ్యాటర్ చుట్టూ ఫీల్డింగ్ మోహరించాడు {Captain’s Field Setup} కెప్టెన్ పాట్ కమీన్స్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ వికెట్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలానే ఫీల్డింగ్ మోహరించాడు.
Also Read: Happy Retirement: ఇక మీ సేవలు చాలు.. అశ్విన్ లాగా రిటైర్మెంట్ ఇవ్వండి..!
కానీ రోహిత్ శర్మ టేలండర్లకు గౌరవం ఇస్తూ ఫీల్డర్లను కాస్త దూరం పెట్టాడు. కానీ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మాత్రం బ్యాటింగ్ లో ఉన్న మహమ్మద్ సిరాజ్ – వాషింగ్టన్ సుందర్ లని ఆందోళనకు గురి చేసేలా దాదాపు ఏడు మంది ఫీల్డర్లను వీరి చుట్టూ మొహరించాడు {Captain’s Field Setup} . అయినప్పటికీ వాషింగ్టన్ సుందర్ ధైర్యంగా ఆటపై ఫోకస్ పెట్టాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెట్టింగ్ ని చూసి కాస్త ఆందోళనకు గురైన సిరాజ్ అవుట్ అయ్యాడు. కాగా ఈ ఫీల్డ్ సెట్టింగ్ ఫోటోని షేర్ చేస్తూ “pic of the day” అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Difference in the approach of the two captains. #INDvsAUS pic.twitter.com/pYFxBTDoVJ
— Prayag (@theprayagtiwari) December 30, 2024