Satya Nadella – CM Revanth: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల గూగుల్ ప్రతినిధులు కూడా సీఎం ను కలిసి హైదరాబాద్ నగరంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ వైపు పాలన, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు. తాజాగా పెట్టుబడుల విషయంలో తెలంగాణ సర్కార్ మరింతగా దూసుకు పోతుందని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడమే.
సీఎం రేవంత్ రెడ్డిని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అంశం వీరి మధ్య చర్చకు వచ్చిందని సమాచారం. అయితే తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అలాగే సీఎం భేటీలో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్‌పై చర్చ సాగింది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకోవడంతో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు.
Also Read: Congress MP: పవన్ కు థ్యాంక్స్.. అంబటికి సినిమా ఛాన్స్.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్
హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు సత్య నాదెళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, సత్య నాదెళ్లకు వివరించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించి తెలుసుకున్న సత్య నాదెళ్ల అదొక బృహత్తర కార్యక్రమంగా పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యత సాధించడం ద్వార, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో సత్య నాదెళ్ల భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు కూడ పాల్గొన్నారు.
మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు
స్కిల్ యూనివర్సిటీ, AI క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చ pic.twitter.com/p7GXRAUl1K
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024