E-Paper
Advertisement

Viral Video: శునకానికి ఘనంగా శ్రీమంతం.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: శునకానికి ఘనంగా శ్రీమంతం..  నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Dog’s Baby Shower Function: మనుషులతో పోల్చితే కుక్కలు ఎంతో ఆప్యాయతతో ఉంటాయి. విశ్వాసానికి మారుపేరైన జంతువులు. అందుకే, చాలా మంది మనుషులు వాటిని ఇష్టపడుతారు. కొంత మంది తమ ప్రాణంలా చూసుకుంటారు. కుక్కలను కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఇప్పటి వరకు కుక్కలకు బర్త్ డే పార్టీలు చేసిన వారిని చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు ఓ ఫ్యామిలీ తమ కుక్కకు శ్రీమంతం చేసి ప్రేమను చాటి చెప్పింది.  ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

అట్టహాసంగా కుక్కకు శ్రీమంతం!

తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ తమ కుక్కకు అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఓ మహిళకు ఎంత గొప్పగా శ్రీమంతం వేడుక చేస్తారో కుక్కకు కూడా అలాగే చేశారు. కొత్త దుస్తులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నగలతో కన్నుల పండువగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముందుగా అరటి ఆకులతో డెకరేట్ చేశారు. ముందు టేబుల్ వేసి, దాని మీద తెల్లటి వస్త్రాన్ని వేశారు. దాని మీద కుక్కను నిలబెట్టి దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత కుక్క పసుపు రాశారు. ఆ తర్వాత కొత్త దుస్తులు వేశారు. హారతి ఇచ్చి, చిల్లలర డబ్బులు తిప్పి దిష్టి తీశారు.  ఆ తర్వాత మెడకు నెక్లెస్ సహా, ఇతర ఆభరణాలను అలంకరించారు. నుదుటిన పాపిడ బిల్లను వేశారు. పూలతో అలంకరించి.. ఆ తర్వాత దాని శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

Advertisement

Read Also:  నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Advertisement

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో జరిగిందని తెలిసినప్పటికీ, ఎక్కడ అనేది కచ్చితంగా తెలియదు. కానీ, నెటిజన్లు ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “పెంపుడు కుక్కల పట్ల చాలా మందికి ఎంతో ప్రేమ ఉంటుందని వినడమే కాదు. ఇప్పుడు నిజంగా చూస్తున్నాను” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “సమాజంలో ప్రతి ఒక్కరు మూగ జీవాల పట్ల ఇలాగే ప్రేమను చూపిస్తే చాలా బాగుంటుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: మహేష్ బాబు కారు చలాన్లు ఆన్ లైన్ లో పే చేసిన అభిమాని, ఇదేం పిచ్చిరా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×