E-Paper
Advertisement

Sri Lankan players ill: షాహిన్ ఆఫ్రిది ఇంట్లో విందు.. శ్రీలంక ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్?

Sri Lankan players ill: షాహిన్ ఆఫ్రిది ఇంట్లో విందు.. శ్రీలంక ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్?
Advertisement

Sri Lankan players ill: సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ ని పాకిస్తాన్ జట్టు 3 – 0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ 3 వన్డేల సిరీస్ లో మంగళవారం రోజు జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు ఆరు పరుగుల తేడాతో శ్రీలంక పై గెలుపొందింది. ఈ మొదటి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన అతిథ్య పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ కష్టసాధ్యమైన 300 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు పోరాడిన శ్రీలంక.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి ఓడింది.

Also Read: Ind vs pak: పాక్ చేతిలో ఇండియా ఓటమి.. వివాదంగా మారిన క్యాచ్.. ఔటా? నాటౌటా?

Advertisement

ఇక శుక్రవారం జరిగిన రెండవ వన్డేలో శ్రీలంకపై పాకిస్తాన్ మరోసారి విజయం సాధించి వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈ రెండవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్.. 48.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక రేపటినుండి పాకిస్తాన్ – శ్రీలంక మధ్య రావల్పిండిలో ముక్కోనపు టోర్ని జరగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు జింబాబ్వే బరిలో నిలిచింది.

3 వన్డేలను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్:

ఇక ఆదివారం రోజు జరిగిన మూడవ వన్డేలో కూడా పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసి సిరీస్ ని 3 -0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ చివరి వన్దేలో మొదట బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలుపొందింది. ఇక ఈ మూడు వన్డేలలో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టిన హరీస్ రవుఫ్ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” గా నిలిచాడు.

Advertisement

Also Read: Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!

పాక్ కెప్టెన్ డిన్నర్.. లంక ప్లేయర్లకు వాంతులు, విరేచనాలు:

పాకిస్తాన్ – శ్రీలంక మధ్య వన్డే సిరీస్ పూర్తయిన అనంతరం ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సిరీస్ ని పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే సిరీస్ గెలిచిన తర్వాత శ్రీలంక క్రికెటర్లకు {Sri Lankan players} ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది గ్రాండ్ డిన్నర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ డిన్నర్ కి శ్రీలంక ఆటగాళ్లు అంతా హాజరయ్యారని.. అయితే ఈ డిన్నర్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు అంతా వాంతులు, విరేచనాలు, వైరల్ జ్వరంతో అనారోగ్యానికి గురైనట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందరికీ ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో భయాందోళనకు గురయ్యారట. ఈ వార్త తెలిసిన క్రీడాభిమానులు.. శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్ వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

Big Stories

Advertisement
×