Business Meeting Employee Laughs| ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ చూపించాలని.. సీరియస్ గా పనిచేయాలని ప్రతి ఆఫీసులో బాస్ కోరుకుంటాడు. అయితే ఒక ఉద్యోగి ఆఫీసులో అందరిముందు తన బాస్ ని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. అది కూడా ఒక బిజినెస్ మీటింగ్ లో అందరూ చూస్తుండగా.. అతను ఎందుకు నవ్వుతున్నాడు. ఎవరికీ అర్ధం కాలేదు. కానీ దీని గురించి సదరు ఉద్యోగి సోషల్ మీడియాలో ఆ కారణాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశాడు.
రెడ్డిట్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం.. ఆఫీసులో సీరియస్ గా బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ లో పాల్గొన్న తనకు బాస్ ముఖం చేసి ఆపుకోలేనంత నవ్వు వచ్చిందని ఓ యువ ఉద్యోగి పోస్ట్ పెట్టాడు. బాస్ తమ బిజినెస్ గురించి సీరియస్ గా చెబుతుంటే తనకు ఆయన ముఖం చూసి రకరకాల మీమ్స్ కనిపించాయని వాటిని ఊహించుకుంటుంటే అసలు తనకు నవ్వు ఆగలేదని పోస్ట్ లో రాశాడు.
“ఆఫీసులో నిన్న చాలా ఫన్నీగా గడిచింది. అందరినీ మా కంపెనీ బిజినెస్ హెడ్ మీటింగ్ కోసం రమ్మన్నాడు. మీటింగ్ రూమ్ లో అందరూ కూర్చొని ఉన్నాం. బిజినెస్ హెడ్ అందరికీ కంపెనీ సేల్స్ పెంచాలని చాలా సీరియస్ గా టార్గెట్స్ ఇస్తున్నాడు. ఏదో పెద్ద విజయాలు సాధించాలని ప్రసంగం ఇస్తున్నాడు. అప్పుడే నాకు అనుకోకుండా కళ్లు ముందర ఒక ఫన్నీ మెమె మెదిలింది. నేను కొంచెం నవ్వాను. అది మా బాస్ చూశారు. నన్ను ‘ఏమైంది? ఏదైనా జోక్ వేశానా?’ అని ప్రశ్నించాడు. నాకు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే నేను సమాధానం చెప్పలేదు.
Also Read: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?
బాస్ మళ్లీ అడిగాడు. ‘నువ్వు నేను చెప్పేది వింటున్నావా?’ అని అడిగాడు. అప్పుడు అతని కన్‌ఫ్యూజ్ అయిన ముఖం చూసి.. నాకు మరో మెమె గుర్తుకొచ్చింది. వెంటనే పగలి బడి నవ్వేశాను. అందరూ మీటింగ్ లో నన్నే చూస్తూ ఉన్నారు. వారెవరికీ నేను కారణం చెప్పలేదు. కానీ మా బాస్ ఇచ్చే సేల్స్ టార్గెట్స్ అసలు ఊహకు అందకుండా ఉన్నాయి. అందరూ తెల్లముఖాలు వేశారు. ఆ టార్గెట్స్ ఏంటి? అవి సాధ్యమేనా.. చెప్పేవాడికే ఈ టార్గెట్స్ అచీవ్ చేయగలమని నమ్మకం లేదు. అతని ముఖం చూస్తే అదే తెలుస్తోంది.” అని రెడ్డిట్ పోస్ట్ లో జరిగిందాన్ని వివరించాడు.
అయితే ఇంత జరిగాక అతడిని మీటింగ్ నుంచి బాస్ వెళ్లగొట్టాడంట. ఆ తరువాత ఆ ఉద్యోగికి కంపెనీ హెచ్ ఆర్ పిలిచి వార్నింగ్ ఇచ్చారట. ఆఫీసులో అతని ప్రవర్తన సరి చేసుకోవాలని చెప్పారట.
ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. దీన్ని చదివిన వారందరూ రకరకాలా కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “ఏంటి బ్రో అంత సీరియస్ పరిస్థితిలో నీకు నవ్వెలా వచ్చింది. మీమ్స్ గురించి ఆలోచనలు రావడం తప్పుకాదు. కానీ మీ మేనేజర్ ఒకసారి అలర్డ్ చేసినా నువ్వు మారలేదంటే నీవు కోరుకొని కష్టాలు తెచ్చుకున్నట్లే” అని రాశాడు.
మరో యూజర్ అయితే.. “చాలా మంచి అలవాటు.. టెన్షన్ లో ఉన్నప్పుడు అలా నవ్వాలి. నేను కూడా నా కింది పెదవిని కొరికేసుకుంటాను. కానీ ఆఫీసులో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీకు ఉద్యోగం ఊడలేదు. సంతోషించు” అని కామెంట్ పెట్టాడు.