BigTV English

King Cobra Rescue Video: ఇదేం కింగ్ కోబ్రా బాబోయ్.. ఆ లేడీ ఆఫీసర్ గుండె గట్టిదే.. వీడియో చూస్తే వణుకుడే!

King Cobra Rescue Video: ఇదేం కింగ్ కోబ్రా బాబోయ్.. ఆ లేడీ ఆఫీసర్ గుండె గట్టిదే.. వీడియో చూస్తే వణుకుడే!

King Cobra Rescue Video: వెనుక నుంచి నెమ్మదిగా రావడం మొదలుపెట్టింది ఆ కింగ్ కోబ్రా.. జనం ఒక్కసారిగా షాక్! ఒక్కసారి ఎగిరి పడితే ప్రాణాలే బలి అయ్యేంతగా పొడవున్న అది.. ఆ సమయంలో ఓ మహిళా అధికారిణి మిగిలిన అందరి కన్నా ముందు వచ్చి దాన్ని అలా పట్టేసింది. మొదటిసారి ఇలాంటి విషపూరిత పాముతో తలపడినా.. ఏమాత్రం భయపడకుండా సాహసంగా వ్యవహరించింది. ఇప్పుడీ దృశ్యం చూసినవారంతా.. ఓయమ్మో ఇదేం సీన్ బాబోయ్ అనేస్తున్నారు.


ఎక్కడ జరిగింది?
పెప్పర అడవుల్లోని ఓ నివాస ప్రాంతంలో ఊహించని ఘటన ఇది. ఒకవైపు స్థానికులు స్నానాల కోసం కాలువ దగ్గరికి వెళ్తుండగా, మరోవైపు ఓ భారీ పాము నెమ్మదిగా ప్రవేశిస్తుంది. అదే 18 అడుగుల పొడవు గల భారీ కింగ్ కోబ్రా. దాన్ని చూసిన స్థానికులు భయంతో వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో, అలర్ట్ అయిన అటవీ అధికారులు రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దించారు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జి ఎస్ రోష్ని రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

తిరువనంతపురంలోని పరుతిపల్లి రేంజ్‌లో పనిచేస్తున్న రోష్ని ఇప్పటి వరకు 800కి పైగా పాములను రక్షించి ప్రజల ప్రాణాలను కాపాడిన అనుభవజ్ఞురాలు. అయితే, ఇదే ఆమె మొదటిసారి కింగ్ కోబ్రాతో ప్రత్యక్షంగా పోరాడిన రెస్క్యూ. కానీ ఆమెలో భయం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆమె చూపిన ధైర్యం, చాకచక్యం చూసి అక్కడి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.


ఎన్ని అడుగుల కింగ్ కోబ్రానో తెలుసా?
పెప్పర అడవులకు సమీపంలోని అంచుమరుతుమూట అనే నివాస ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన కొందరు వ్యక్తులు నీటి ప్రవాహం వెంట కొట్టుకుంటూ వస్తున్న భారీ కింగ్ కోబ్రాను చూసి షాక్ అయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే అప్రమత్తమైన వారు రోష్ని నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని పంపారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న రోష్ని, పామును గమనించి ప్రొఫెషనల్ టెక్నిక్స్‌తో ఎంతో శ్రద్ధగా దాన్ని బంధించారు. ఆ కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవుతో కనిపించడంతో చాలా మంది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కానీ రోష్ని మాత్రం ధైర్యంగా ఎదుర్కొని దాన్ని జీవంతో పట్టుకుంది.

Also Read: Venu Swamy: తిరుమల లైన్ లో ఉన్నప్పుడు అలా చేస్తారా? అమ్మవారికి అవే నైవేద్యం.. వేణుస్వామి అనుచిత వ్యాఖ్యలు!

ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలూ ఇలా అటవీ శాఖలో ధైర్యంగా సేవలందిస్తున్నారన్న విశ్వాసాన్ని ఈ ఘటన మరోసారి పెంచింది. కింగ్ కోబ్రా లాంటి విషపూరిత పాములు ఒకవేళ ఆగ్రహించినట్లయితే ప్రాణాంతకంగా మారతాయి. అయితే రోష్ని, దాని యొక్క అలజడులను గమనిస్తూ, తగిన మెలకువలతో దాన్ని చాకచక్యంగా వలలోకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.

ఇంతకుముందు కూడా రోష్ని ఎన్నో రకాల పాములను రక్షించిన అనుభవం కలిగినవారు. కానీ, కింగ్ కోబ్రాను పట్టు చేయడం మాత్రం సవాలుతో కూడిన పని. ఇది ఆమెకు మొదటి సారి అయినప్పటికీ, మృదుస్వభావంతో, సమయస్ఫూర్తితో, పామును ఎలాంటి హానీ కలగకుండా రక్షించి, అడవిలోకి వదిలిపెట్టారు.

ఈ ఘనతను సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు ఆమెను లేడీ నాగరాజు, స్నేక్ క్వీన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్న రోష్ని వంటి అధికారుల ధైర్యం, సేవా తత్వం చూస్తే.. మనం గర్వపడక తప్పదు. ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.. అటవీ శాఖలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో. అప్రమత్తంగా ఉండే ధైర్యం, సమయానికి స్పందించే చిత్తశుద్ధి, ప్రకృతిని కాపాడాలన్న కర్తవ్య భావన.. ఇవన్నీ కలిసిన ప్రతిరూపమే రోష్ని. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారగా, అందరూ సదరు ఫారెస్ట్ అధికారిణిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related News

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

Viral Video: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?

×