ఎక్కడో నీటి మడుగుల్లో ఉండే మొసళ్లు ఇంటి వద్దకు రావడం ఏంటి..? కాలింగ్ బెల్ కొట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజం, ఆ మొసలి మరో సహచరుడితో కలసి ఆ ఇంటి వద్దకు వచ్చింది. మెల్లగా కాలింగ్ బెల్ కొట్టింది. ఆ తర్వాత మరో తలుపు వైపు వెళ్లింది. ఆ తలుపుని నెట్టే ప్రయత్నంలో అది కిందపడింది. అయితే ఆ మొసలితోపాటు వచ్చిన మరో మొసలి మాత్రం అక్కడే నేలపై పడుకుని ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫ్లోరిడాలో మాత్రమే..
ఇలాంటి ఘటనలు ఫ్లోరిడాలో మాత్రమే జరుగుతాయంటూ స్థానిక మీడియా ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ వీడియో మరింత వైరల్ గా మారింది. అమెరికా మొసళ్లకు ప్రసిద్ధి. అందులోనూ ఫ్లోరిడాలో గేటర్ అనే పేరున్న మొసళ్ల జాతి బాగా ఫేమస్. ఇవి కాస్త పెద్ద సైజులో ఉంటాయి. మొసళ్లు మడుగులు దాటి రోడ్లపైకి రావడం, ఇతర ప్రాంతాల్లో కనపడటం అక్కడ సహజం అయితే ఇలా నేరుగా ఇంటికి వచ్చి, అతిథుల్లాగా తలుపు తట్టడం, కాలింగ్ బెల్ మోగించడం మాత్రం అసాధారణ విషయం. అందుకే ఈ వీడియో వైరల్ గా మారింది.
Florida man finds that alligators are now ringing his Ring Doorbell looking for treats… 😆 https://t.co/5X2ISougZR
— J Allen Harris (@JAllenHarris) April 19, 2025
ఫ్లోరిడాలోని బైజ్ వెంటైన్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి ఈ మొసళ్లు వచ్చాయి. ఆ ఇంటి తలుపులకు బిగించి ఉన్న సీసీ కెమెరాల్లో మొసళ్ల కదలికలు రికార్డ్ అయ్యాయి. గతంలో ఇంటి పరిసరాల్లో మొసళ్లు కనిపించిన సందర్భాలు లేవని, అయితే అవి ఇలా ఇంటివద్దకు రావడం, కాలింగ్ బెల్ మోగించడం మాత్రం సంచలనంగా మారింది. దీంతో ఆ ఇంటిలోనివారు భయపడిపోయారు. ఆ వీడియోని ఓ మీడియా సంస్థకి ఇవ్వడంతో అది వెలుగులోకి వచ్చింది.
ఒకటి మాత్రమే..
ఆ ఇంటికి రెండు మొసళ్లు వస్తే, విచిత్రంగా అందులో ఒకటి మాత్రమే సూపర్ యాక్టివ్ గా ఉంది, రెండోది కేవలం నేలపై పడుకొని ఉంది. అద్దాలు బిగించి ఉన్న ఇంటి తలుపుకి ఉన్న కాలింగ్ బెల్ ని ఒక మొసలి మోగించింది. ఆ తర్వాత పక్క తలుపువైపు వంగింది. ఆ తర్వాత తలుపు తెరిచే ప్రయత్నం చేస్తూ రెండు కాళ్లపై పైకి లేచింది. బ్యాలెన్స్ చేసుకోలేక ఆ తర్వాత పక్కనే ఉన్న టేబుల్ పై పడింది. అంతటితో ఆ వీడియో పూర్తవుతుంది.