BigTV English
Advertisement

Funny Bike Number: ఒడియమ్మా.. ఇదేం నెంబర్ ప్లేట్ రా అయ్యా.. నేనెక్కడా చూడలే!

Funny Bike Number: ఒడియమ్మా.. ఇదేం నెంబర్ ప్లేట్ రా అయ్యా.. నేనెక్కడా చూడలే!

Viral Video: ఈ రోజుల్లో కుర్రాళ్ల ఆలోచనలు వింతగా ఉంటున్నాయి. తల్లింద్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల మర్యాద బొత్తిగా తెలియకుండా పోతోంది. అమ్మా అయ్యలు కష్టపడి.. పిల్లలు కష్టపడొద్దని బైకులు కొనిస్తే వాటిని సర్కస్ బండ్ల మాదిరిగా మార్చేస్తున్నారు. ఫలానా తాలూకా అంటూ నెంబర్ ప్లేట్స్ మీద రాసుకోవడం, సైలెన్సర్లను మోడిఫై చేయించుకుని జనాలకు చిరాకెత్తించేలా శబ్దం చేయడం, బండికి ఉండకూడని అదనపు హంగులు అద్దుతున్నారు. ఒకటేమిటీ రవాణా నిబంధనలను పూర్తి విరుద్ధంగా తయారు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి పోలీసులకు పట్టుబడితే, ఫైన్ కట్టి తప్పించుకుంటున్నారు.


విజయవాడలో ఫన్నీ నెంబర్ ప్లేట్

తాజాగా విజయవాడలో వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఓ క్రేజీ నెంబర్ ప్లేట్ కనిపించింది. దాన్ని చూసి పోలీసులు షాకయ్యారు. ఇలాంటి నెంబర్ ప్లేట్ ను తమ జీవితం చూడలేదంటే ఆశ్చర్యం వ్యక్తి చేశారు. ఇంతకీ ఆ నెంబర్ ప్లేట్ మీద ఏం ఉందంటే.. విజయవాడలో సాయంత్రం పూట పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ పల్సర్ బైక్ మీద ముగ్గురు యువకులు రావడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే బైక్ ను వెనక్కి మలిపి రాంగ్ రూట్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, వెనుక కూడా పోలీసులు ఉండటంతో సాధ్యం కాలేదు. చివరకు పోలీసుల ముందుకు వచ్చి ఆపారు. ముగ్గురు యువకులు బైక్ మీద రావడమే కాదు, ఒక్కరికీ హెల్మెట్ లేదు. ఆ బైక్ కు ఉన్న నెంబర్ ప్లేట్, మోడిఫై చేసిన సైలెన్సర్ చూసి పోలీసులు షాకయ్యారు.


నెంబర్ ప్లేట్ మీద ‘మాఫియా’

సదరు బైక్ కు ముందు కూడా నెంబర్ ప్లేట్ లేదు. వెనుక ఉన్న నెంబర్ ప్లేట్ మీద మాఫియా అని రాసి ఉంది. ఇంతకీ ఏంటీ మాఫియా కథ అని పోలీసులు సదరు వాహనదారుడిని నిలదీశారు. అయితే, రీసెంట్ గా తాను ఓ వ్యక్తి నుంచి ఈ బైక్ ను కొనుగోలు చేశానని చెప్పాడు. కొత్త నెంబర్ ప్లేట్ కూడా వచ్చిందన్నాడు. వెంటనే బిగిస్తానని చెప్పాడు. బండి అక్కడే ఉంచుకుని ఇంటికి పంపించి కొత్త నెంబర్ ప్లేట్, హెల్మెట్ ను తెప్పించారు పోలీసులు. మాఫియా నెంబర్ ప్లేట్ ను తొలగించి.. కొత్త నెంబర్ ప్లేట్ ను బిగించారు. బైక్ సైలెన్సర్ కూడా మార్చాలని సూచించారు. మరోసారి నెంబర్ ప్లేట్ లేకుండా కనిపిస్తే, బైక్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బండి ఉన్నది ఉన్నట్లు ఉంచుకోకుండా, ఎందుకురా అయ్యా ఈ వేషాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఫైన్ వేసి చేతులు దులుపుకోకుండా, నెంబర్ ప్లేట్ మార్చి, తగిన సూచనలు చేసిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Read Also: పెళ్లి చేసుకుంటారు, కానీ.. రొమాన్స్ చెయ్యరు.. ఆ దేశంలో కొత్త ట్రెండ్ మొదలు!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×