Manisharma:ప్రస్తుతం ఉన్న యూత్ కి మోస్ట్ ఎంటర్టైనింగ్ అంశాలు అంటే ఒకటి సినిమా రెండు క్రికెట్ అని చెప్పాలి. చాలామంది సెలబ్రిటీస్ కూడా క్రికెట్ ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అయినప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారో మనకు అర్థమవుతూ వస్తుంది. ఒక సందర్భంలో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడేమో అని అందరూ ఊహించారు. కానీ వారసత్వంగా సినిమా ఇండస్ట్రీని వదలకుండా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేశాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమన్ గురించి తెలిసిన చాలామంది తమన్ ఎంత బాగా క్రికెట్ ఆడుతాడో చెబుతూ ఉంటారు. రీసెంట్ గా తమన్ క్రికెట్ ఆడిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంపైర్ తో గొడవ పడిన వీడియో మరీ వైరల్ అయింది.
మణిశర్మ దగ్గర మొదలు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణిశర్మ ఒకరు. ప్రస్తుతం మణిశర్మ హవా కొంచెం తగ్గింది. కానీ ఒకప్పుడు మణిశర్మ మ్యూజిక్ అంటేనే నెక్స్ట్ లెవెల్లో అనిపించేది. అందరూ మణిశర్మ అని మెలోడీ బ్రహ్మ అంటారు. వీణతో విధ్వంసం సృష్టించగలగటం కేవలం మణిశర్మకు మాత్రమే సాధ్యమైంది. మహేష్ బాబు కి మణిశర్మ ఇచ్చిన కొన్ని ఆల్బమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అయితే మణిశర్మకి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకప్పుడు ఏదైనా పని ఉంటే తమన్ కు అప్పజెప్పేసి మరి క్రికెట్ ఆడడానికి వెళ్లిపోయే వారంట. తమన్ అలా వదిలేసి వెళ్లిపోవడంతో ఏడ్చేవాడు అని మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా వారానికి అప్పట్లో మూడు రోజులు క్రికెట్ ఆడేవాలంట. పొద్దున్నే 6 గంటలకు లేచి క్రికెట్ ఆడి తమ మ్యూజిక్ పని మొదలు పెట్టే వాళ్ళం అంటూ మణిశర్మ ఇంటర్వ్యూలో తెలిపారు.
తమన్ క్రికెట్
కిక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు తమన్. మొదటి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తమనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తమన్ చేసిన కొన్ని సాంగ్స్ విపరీతంగా హిట్ అయ్యాయి. వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో తమన్ మ్యూజిక్ కొంచెం రిపీట్ గా అనిపించింది. వెంటనే కొంచెం బ్రేక్ తీసుకున్నాడు తమన్. ఆ తర్వాత కొన్ని రోజులు పాటు విపరీతంగా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలిప్రేమ సినిమాతో మంచి మ్యూజికల్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
Also Read : Single Movie : ఎవరెవరిని ఇమిటేట్ చేశాడో గమనించారా.?