దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు హోలీని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా, బంధు మిత్రులు అంతా కలిసి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. కలర్స్ లో తడిసి ముద్దయ్యారు. డీజే పాటలు, రెయిన్ డ్యాన్సులు చేస్తూ జోష్ ఫుల్ గా గడిపారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా హోలీ వేడులకు కలర్ ఫుల్ గా జరిగాయి. అయితే, కొన్ని చోట్ల హోలీ పేరుతో యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆకతాయిల చేష్టలు చూసి నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
హోలీ పేరుతో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన
తాజాగా హోలీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొంత మంది యువకులు, యువతులతో చీప్ గా ప్రవర్తించారు. ఏకంగా ఓ అమ్మాయి దుస్తులను చింపేశారు. అభ్యంతరకరంగా చేతులతో తాకుతూ ఆమెకు రంగులు పూశారు. చుట్టూ ఆకతాయిలు గుమిగూడి అసభ్యంగా ప్రవర్తించారు. నిస్సహాయ స్థితిలో ఆ అమ్మాయి కేవలం లో దుస్తులతో కనిపించింది. వారి ప్రవర్తనకు కంటతడి పెట్టింది. ఇక మహింద్రా థార్ కారులో కూర్చున్న ఇద్దరు యువతులతోనూ ఆకతాయిల మూక రంగుల చల్లుతూ దురుసుగా ప్రవర్తించారు. మరికొంత మంది రోడ్డు మీద వెళ్లే అమ్మాయిల మీద అభ్యంతరకరంగా రంగులు చల్లారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రవర్తించారు. మరికొంత మంది అమ్మాయిల మీద స్ప్రేలు, స్నో కొడుతూ దురుసుగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది.
Fuck they torned her clothes in name of Holi 🤡
Bhenchodd Bra tak utar di ladkion ki 🤡🤡🤡 pic.twitter.com/e4bFo5WeAC
— BHAGGA BILLA (@AnkitBansal91) March 13, 2025
Read Also: ఈ కుల్ఫీ ఐస్‌లు కొన్నా, తిన్నా, అమ్మినా జైలుకే.. ఓర్ని హోలీని ఇలా వాడేస్తున్నారా?
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి, డీజీపీకి ట్యాగ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటన్నారు. “హోలీ పేరుతో అమ్మాయిలతో అడ్డగోలుగా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు” అని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఇలాంటి నీచమైన పనులను తమ తల్లిదండ్రులు చూస్తే ఏం అనుకుంటారో అనే బుద్ది లేకుండా ప్రవర్తిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోలీ పేరుతో అసభ్యకర పనులు చేస్తూ సమాజానికి ఏం సందేశం పంపుతారని మరొకరు ప్రశ్నించారు. పిల్లలు కూడా ఈ వీడియో చూసి ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వాలు, పోలీసులు సీరియస్ గా వ్యవరించాలని కోరుతున్నారు. ఇలాంటి చెత్త పనులు చేసేవారి తాట తీస్తేనే మిగతా వారిలో భయం పుడుతుందంటున్నారు.
Read Also: రెండు చేతుల్లేవ్.. గుండె బరువెక్కిస్తున్న జొమాటో బాయ్ వీడియో!