BigTV English

Tollywood: ఇండస్ట్రీలో సంచలనం… విష్ణుప్రియతో సహా 74 మంది సెలబ్రేటీలకు జైలే..!

Tollywood: ఇండస్ట్రీలో సంచలనం… విష్ణుప్రియతో సహా 74 మంది సెలబ్రేటీలకు జైలే..!

Tollywood: బెట్టింగ్ భూతం.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది యూట్యూబ్ స్టార్ట్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి, సినీ సెలబ్రిటీల కంటే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇకపోతే యూట్యూబ్లో తమకేదో మంచి కంటెంట్ అందిస్తున్నారని నమ్మిన ఎంతోమంది అమాయకపు ప్రజల ఆలోచనలను సొమ్ము చేసుకుంటున్నారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇకపోతే యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ కలిగి ఉన్నవారు సొంత లాభాన్ని పొందడానికి బెట్టింగ్ యాప్ కంపెనీలతో చేతులు కలిపి, అలా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ.. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.


ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యూట్యూబర్స్..

ముఖ్యంగా ప్రజలు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా భావిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్ అనేది ఒక అడిక్ట్ యాప్. దీని ఊబిలో పడ్డారు అంటే బయటకు రావడం కష్టం. గేమ్స్ పేరిట మొదట ఇంట్రెస్ట్ చూపి ఆ తర్వాత డబ్బులు వస్తాయని ఆశ చూపి లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ లో పెట్టి మొత్తం కోల్పోతున్నారు .ఇక చివరికి చేసేదేమీ లేక ఇంట్లో భార్య లేదా తల్లి నగలు అమ్మి, ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బు పెట్టిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకున్నవారు ఉన్నారు. ఇక అప్పులు చేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోసిన వారు ఉన్నారు. ఇలా ఎంతోమంది డబ్బులు పోగొట్టుకొని చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.


74 మంది అరెస్ట్..

అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడితే ప్రభుత్వాలు ఊరుకుంటాయా.. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఐఏఎస్ వీ.సీ.సజ్జనార్ ఆధ్వర్యంలో మొత్తం 74 మందిని బయటకు తీశారు. ఇక సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న వారిని ఒక్కొక్కరిగా ఏరుతూ అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాని (Nani) అనే ఒక యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేయగా.. ఇప్పుడు సన్నీ యాదవ్ (Sunny Yadav) అనే మరో యూట్యూబర్ కోసం వెతుకులాడుతున్నారు. ఒక త్వరలోనే ఇతడిని కూడా అరెస్టు చేయనున్నట్లు సమాచారం. వీరితోపాటు మరో 72 మందిని పోలీసులు త్వరలోనే, అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక వీరిలో ప్రముఖ సినీనటి విష్ణుప్రియ (Vishnu Priya) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కూడా డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది. ఈమెను నమ్మి అందులో డబ్బు పెట్టిన వారు మోసపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు ప్రజల మంచి కోరతారని అందరూ అనుకుంటారు. కానీ వీరు సొంత లాభం కోసం ప్రజలను పక్కన పెట్టారని పాపం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక వీరందరినీ అరెస్టు చేస్తారని మిగిలిన వారిని కూడా త్వరలోనే వెతికి వారిని కూడా అరెస్టు చేస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×