Viral video: నేపాల్ దేశం ప్రస్తుత పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లపై విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ, యువత ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నిషేధం ఎత్తివేత తర్వాత కూడా జెన్ జెడ్ (Gen Z) యువత నేతృత్వంలోని ఆందోళనలు అవినీతి, నిరుద్యోగం, సామాజిక సమస్యలపై పోరాడుతున్నారు. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాసాలను ధ్వంసం చేశాయి. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 23 మంది మృతిచెందగా.. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు రాజకీయ నాయకులు రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link
ఈ గందరగోళంలో ఒక వైరల్ వీడియో ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిందని చెప్పవచ్చు. ఒక జెన్ జెడ్ ఆందోళనకారుడు నేపాల్ పార్లమెంట్ భవనం, ఇతర ప్రభుత్వ భవనాలు మండిపోతున్న సమయంలో వాటి ముందు భాగంలో డ్యాన్స్ చేస్తూ ‘రీల్స్’ కు స్టెప్పులేశాడు. ఈ వీడియోలో ఆ యువకుడు ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా.. వెనుక ధ్వంసమవుతున్న భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్న దృశ్యం భయానకంగా కనిపిస్తుంది. ఈ ఘటన ప్రధాని నివాసం సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. యువత ప్రవర్తనపై తెగ విమర్శలకు దారి తీసింది. అధికారులు ఈ ఘటనను విచారిస్తున్నారు.
దురదృష్టవశాత్తు, ఈ ఆందోళనల్లో నిన్న మాజీ ప్రధాని ఝాలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ కూడా మరణించారు. ఆందోళనకారులు వారి ఇంటిని ముట్టడించి, నిప్పంటించడంతో ఆమె ఇంట్లోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు నేపాల్‌లో రాజకీయ అస్థిరతను మరింత పెంచాయి. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. జెన్ జెడ్ పేరుతో యువత తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తోంది.
ALSO READ: Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే ఛాన్స్, డోంట్ మిస్
’ఇది దురదృష్టకరం! జెన్ జెడ్ యువత తమ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. దీని నుంచి బయటపడటానికి దశాబ్దాల సమయం పట్టొచ్చు’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు.. ‘మొదట్లో వారిని సమర్థించాను, కానీ ఇప్పుడు ఇది సమస్యగా మారింది’ కామెంట్ చేసుకొచ్చారు. ‘అసలు నేపాల్ యువతకు ఏమైంది..? మొదటి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.. కానీ ఇప్పుడు ఏమైంది?” అని మరొకరు కామెంట్ చేశారు. నీ ఇది సోషల్ మీడియా సంస్కృతి, యువత ప్రవర్తనపై చర్చలు రేపుతోంది. నేపాల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి, కానీ ఈ ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి.