BigTV English

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Bengaluru: ప్రధానమంత్రి మోదీ కర్ణాటక‌లో పర్యటించారు. ఈ టూర్‌లో రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. బెంగళూరు సిటీ వాసులకు రెండు కీలకమైన కానుకలు అందించారు. సిటీలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు.


బెంగళూరులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అదే సమయంలో వర్చువల్‌గా అమృత్‌సర్-కాట్రా, నాగ్‌పూర్-పుణె వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. ఆ తర్వాత బెంగళూరు-బెళగావి వందేభారత్‌ రైలులో కొద్దిసేపు ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. కర్ణాటక నుంచి నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య పదకొండుకి చేరింది.

బెంగళూరు-బెళగావి మధ్య ప్రత్యేకంగా ప్రీమియం రైలు కావాలని అక్కడి ప్రజల చిరకాల డిమాండ్. ఈ రైలుతో ఆ ప్రాంతాల మధ్య ప్రయాణం దాదాపు గంట వరకు తగ్గనుంది. ఉదయం 5.20 గంటలకు బెళగావిలో వందేభారత్ రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.


ALSO READ: ఈ టీచర్ గ్రేట్.. 1 వేల మంది మహిళలు రాఖీ కట్టారు

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.20 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు బెళగావికి చేరుతుంది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1,575లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ. 2,905 గా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

బెంగుళూరు సిటీలో ఆర్‌వీరోడ్డు-బొమ్మసంద్ర మధ్య 19.15 కిలోమీటర్లు మెట్రో ఎల్లో లైన్‌ మార్గాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ.  మెట్రో రెండో దశలో భాగంగా ఎల్లో లైన్‌ను జాతికి అంకితం చేశారు. 16 స్టేషన్లతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం సుమారు రూ. 7,160 కోట్లను ఖర్చు చేశారు.

ఈ లైన్ ప్రారంభంతో బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్ 96 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ఇదికాకుండా బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు. 44 కిలోమీటర్ల పొడవున 31 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మిస్తారు. దీనితర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

 

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×