BigTV English

Golden Face: బంగారం లాంటి గ్లో కావాలంటే.. ఈ ఫేస్ మాస్క్‌లు ట్రై చేయండి..

Golden Face: బంగారం లాంటి గ్లో కావాలంటే.. ఈ ఫేస్ మాస్క్‌లు ట్రై చేయండి..

Golden Face: ముఖం బంగారంలా మెరిసిపోవాలని.. అందంగా ఉండాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. చాలా మందికి అన్ని బావున్నా.. తీరా ముఖం దగ్గరికి వచ్చేసరికి మచ్చలు, మొటిమలు, ఫేస్ డల్‌గా కనిపించడం వంటివి వేధిస్తూ ఉంటాయి. వీటిని తొలగించేందుకు చాలా మంది  రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వేలకు వేలు ఖర్చు చేసి పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. చర్మం మరింత డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే.. బంగారం లాంటి చర్మం మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎప్పుడూ మెరిసే, శుభ్రమైన చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ప్రతిరోజు..
-ఫేస్ వాష్- రోజుకు రెండు సార్లు ముఖాన్ని ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి


-సీరమ్- స్కిన్ టెక్చర్ ఇంప్రూవ్ అవుతుంది.

-మాయిశ్చరైజర్- చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

-సన్ స్క్రీన్- ఉదయాన్నే ముఖానికి పెట్టుకుని, సన్ ప్రొటక్షన్ పొందండి.

వారానికి ఒకసారి

-ఫేస్ స్క్రబ్- ఫేస్ స్క్రబ్ వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

-ఫేస్ మాస్క్- ఎక్సెస్ ఆయిల్, మురికి తొలగించేందుకు

-స్టీమ్- పోర్స్ క్లీన్ అవుతాయి

-పిల్లో కవర్ ఛేంజ్- స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

-మేకప్ బ్రెషెస్ క్లీన్- ల్యూకోవార్మ్ వాటర్, షాంపూతో వాష్ చేయండి.

నెలకు ఒకసారి
ఫేసియల్స్- స్కిన్ హెల్దీతో పాటు ముఖం కాంతి వంతంగా మారుతుంది.

-ప్రొడక్ట్ ఎక్స్ పైర్ డేట్ చెక్ చేసుకోండి.

కొన్ని రకాల ఫెస్ మాస్క్

బియ్యం పిండి, రోజ్ వాటర్, పసుపు
చిన్న బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి తీసుకుని.. అందులో రోజ్ వాటర్, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం చాలా అందంగా, కాంతి వంతంగా మెరుస్తుంది.

ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ మాస్క్
ముల్తానీ మిట్టిని చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో.. రోజ్ వాటర్ కలిపి ముఖానికి పెట్టుకొని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం తాజాగా మిల మిల మెరుస్తుంది.

Also Read: అమ్మాయిలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

శెనగపిండి, పాలు, తేనె ఫేస్ మాస్క్
చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, పాలు, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం కాంతివంతంగా, గ్లోగా కనిపిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Big Stories

×