BIG TV LIVE Originals: ప్రపంచ వ్యాప్తంగా పలువురు అవిభక్త కవలలు ఉన్నారు. కొంత మంది చనిపోయే వరకు కలిసే జీవిస్తే, మరికొంత మందికి డాక్టర్లు అత్యంత కష్టతరమైన ఆపరేషన్ చేసి వేరు చేసిన సందర్భాలున్నాయి. వారిలో కొంత మంది బతికి ఉండగా, మరికొంత మంది చనిపోయారు కూడా. తాజాగా అవిభక్త కవలలకు సంబంధించి ఓ నెటిజన్ కు వచ్చిన డౌట్ మరోసారి ఈ అంశంపై చర్చకు కారణం అయ్యింది. ఒక సినిమా చూసిన నెటిజన్.. ఒకవేళ అవిభక్త కవలల్లో ఒకరు చనిపోతే.. మరొకరి పరిస్థితి ఏంటి? అనే అనుమానం వ్యక్తం చేశాడు. ఇంతకీ అలా జరిగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కీలక అవయవాలు కలిసి ఉంటే?
అవిభక్త కవలల్లో కొందరికి గుండె, కాలేయం, ప్రధాన రక్త నాళాలు కలిసి ఉంటాయి. ఇలా ఉన్న వారిలో ఒకరు చనిపోయినా, రక్త ప్రసరణ నిలిచిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ కాలేయాన్ని పంచుకుని వేర్వేరు హృదయాలు ఉంటే, బతికి ఉన్న వారు మరణించిన వారి నెక్రోటిక్ కణజాలం కారణంగా అవయవ వైఫల్యం లాంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వెంటనే మరో వ్యక్తిని వేరు చేయకపోతే మరో కవల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.
ఇతర అవయవాలు కలిసి ఉంటే?
అవిభక్త కవలలకు వేర్వేరు హృదయాలు, ఇతర ముఖ్యమైన అవయవాలు ఉన్నప్పటికీ, కొంత మందికి మొండెం, ఇతర అవయవాలు అతికి ఉంటాయి. అలాంటి కవలల్లో ఒకరు చనిపోతే బతికి ఉన్న వారు పలు రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడే అవకాశం ఉంటుంది. వారిని వేరు చేయడానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే, ఆ ఆపరేషన్ సక్సెస్ అనేది ఉమ్మడి కణజాలాల పరిధి, వైద్య బృందం సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.
తల భాగం కలిసి ఉంటే?
అవిభక్త కవలల్లో అన్ని శరీర భాగాలు వేరుగా ఉండి, తల మాత్రం కలిసి ఉన్నవాళ్లు కూడా ఉంటారు. వారిలో ఒకరు చనిపోతే, వారి మెదడు రక్త సరఫరాను పంచుకుంటాయా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన రక్త నాళాలను పంచుకుంటే, జీవించి ఉన్న వారి మెదడు దెబ్బతినవచ్చు. లేదంటే రక్త ప్రసరణ అంతరాయం కారణంగా మరణించే అవకాశం ఉంటుంది. వారి మెదళ్ళు వీలైనంత వరకు వేరుగా ఉంటే మరో కవల బతికే అవకాశం ఉంటుంది. కానీ తల విభజన ఆపరేషన్ అనేది అత్యంత సంక్షిష్టమైనది. ప్రమాదకరమైనది కూడా.
Can a doctor or someone else tell me if this could happen to them? pic.twitter.com/ssRJgGe9pG
— Creepy.org (@creepydotorg) May 13, 2025
ఉమ్మడి శరీర నిర్మాణంపై ఆధారపడి ఫలితం
నిజానికి అవిభక్త కవలల్లో ఒకరు చనిపోతే, మరో కవల జీవించి ఉండే అంశం ఉమ్మడి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. క్లిష్టమైన మెదడు కణజాలం, రక్త నాళాలు పంచుకుంటే వారు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన శరీర భాగాలు వేరుగా ఉంటే ఆపరేషన్ ద్వారా కాపాడే ప్రయత్నం చేయవచ్చు. 2003 ఈజిప్షియన్ కవలలను డాక్టర్లు విభజించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇద్దరూ బతికారు. వైద్య సౌకర్యాలు, ఉమ్మడి నిర్మాణాల పరిధి ఆధారంగా ఆపరేషన్ ఫలితాలు మారుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఆధారంగా దీనిని రాశాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదని గమనించగలరు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఈ మాంసాన్ని 100 రోజులు నిల్వ ఉంచి మరీ తింటారు.. మరి కుళ్లిపోదా?