BigTV English

Worm ‘Crawling’ in Dairy Milk Chocolate: డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. జర భద్రం!

Worm ‘Crawling’ in Dairy Milk Chocolate: డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. జర భద్రం!

Worm ‘Crawling’ in Dairy Milk Chocolate in Hyderabad: చాక్లెట్.. ఇష్టపడని వారు అసలు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు చాక్లెట్‌ను చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏడ్చినా, స్కూల్ వెళ్లనని మారం చేసినా చాక్లెట్‌లను కొనిస్తుంటాం. ఇక కొంత మంది టైమ్ పాస్ కోసం లేదా ఎనర్జీ కోసం కూడా చాక్లెట్లను తింటుంటారు. మరి కొందరు ప్రియమైనవారికి చాక్లెట్లను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు.


చాక్లెట్లలో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లు ఎంతో ప్రత్యేకం. తీయని వేడుక ఏదైనా క్యాడ్బరీ ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ కంపెనీ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కాన్సెప్ట్‌ను మన యువకులు, చాక్లెట్ ప్రేమికలు ఫాలో అవుతూ.. తీయని వేడుక ఏదైనా క్యాడ్బరీతోనే చేస్తున్నారు.

వాలైంటైన్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. ఫిబ్రవరి 9న చాక్లెట్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రొజున క్యాడ్బరీ చాక్లెట్‌ల అమ్మకాలు భారీ స్థాయిలో జరిగుంటాయి. మన యూత్ క్యాడ్బరీతో నోరు తీపి చేసుకొని క్రేజీగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్యాబ్బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్ గురించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మన చాక్లెట్ ప్రియల గుండెలదరొచ్చు.


Read More : చాక్లెట్ డే.. మీ ప్రేమను మరింత తీయగా మార్చండి!

వీడియో చూశారు కదా. ఇదే క్యాడ్బరీతో తీయని వేడుక అంటే. రాబిన్ జాకియస్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఈ చాక్లెట్ కొనుగోలు చేసినట్లుగా బిల్ ఫోటో కూడా ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.

Read More: పొట్ట క్యాన్సర్‌తో మరణించిన ఇళయరాజా కూతురు.. కారణాలు ఇవే..!

ఇలాంటి పాడైపోయిన చాక్లెట్లు మార్కెట్‌లోకి వస్తుంటే ఎవరూ పట్టించుకోరా అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించాడు. ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తాడరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్స్‌పైరీ చాక్లెట్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని ఫుడ్‌సేఫ్టీ అధికారులను ఆదేశించింది.

ఈ వీడియో చూసినా నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందురు చాక్లట్ పై ఎక్స్‌పైరీ డేట్ ఉందా అని కామెంట్ చేయగా.. మరికొందరేమో పురుగుతో ఎక్స్‌ట్రా ప్రొటిన్ అంటూ స్మైల్ ఎమోజీస్ పెడుతున్నారు. దీనిపై స్పందిచిన క్యాడ్బరీ సంస్థ.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని వీడియో కింద కామెంట్ చేసింది. కాబట్టి ప్యాకెట్ ఫుడ్స్ కొనేముందు ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×