BigTV English

Chocolate Day: చాక్లెట్ డే.. మీ ప్రేమను మరింత తీయగా మార్చండి!

Chocolate Day: చాక్లెట్ డే.. మీ ప్రేమను మరింత తీయగా మార్చండి!
Chocolate Day History

Valentine’s Week Special Chocolate Day History:


వాలెంటైన్ వీక్‌.. ప్రేమికులకు పెద్ద పండుగ. సాధారణంగా ప్రేమలో ఉన్న వారికి ప్రతి రోజూ ఎంతో ప్రత్యేకం. కానీ ఈ వాలెంటైన్ వీక్ మాత్రం మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైన భావంతో మీ లవ్‌ను తెలియజేసే అవకాశం ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లో మూడవ రోజు ఫిబ్రవరి 9న చాక్లెట్ డే. చాక్లెట్ డే ఎంతో రొమాంటిక్ అయినది. ఈ స్వీటెస్ట్ డే కోసం జంటలు ఎదురు చూస్తుంటారు.

ఎవరైనా తమ ప్రేమను, సంతోషాన్ని పంచుకునేందుకు చాక్లెట్‌ను షేర్ చేసుకుంటారు. ప్రేమించిన వారికి చాక్లెట్ తినిపించి అనుబంధంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఈ రొమాంటిక్ ఫీలింగ్ గొప్ప అనుభూతి ఇస్తుంది. అయితే చాక్లెట్ వెనుక 4 వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అమెరికాలో దీనిని దేవతల ఆహారం అని పిలుస్తారు. చాక్లెట్ ‌డే సందర్భంగా దాని గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.


Read More : Anti Valentine Week : యాంటీ వాలెంటైన్ వీక్.. చెంప పగలగొట్టొచ్చు..!

చరిత్ర ప్రకారం చాక్లెట్ తయారు చేసే కోకో చెట్టు మొదటగా అమెరికాలో దొరికింది. కానీ ఇప్పుడు 70 శాతం కోకో చెట్లు ఆఫ్రికాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచే వేరే ప్రాంతానికి సరఫరా అవుతున్నాయి. మెక్సికో, మధ్య అమెరికా చాక్లెట్‌ను మొదటగా తయారు చేశారని చరిత్ర చెబుతుంది. 1528లో స్పెయిన్ మెక్సికోను స్వాధీన పరుచుకోగా ఆ రాజు తిరిగి స్పెయిన్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కోకో విత్తనాలను తీసుకెళ్లాడు.

స్పెయిన్ 1615 వరకు చాక్లెట్‌ను ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచింది. ఫ్రెంచ్ రాజు లూయిస్ 13వ స్పానిష్ రాజు ఫిలిప్ 3వ కుమార్తెను ఆస్ట్రియాకు చెందిన అన్నేవి ని విహహం చేసుకున్నాడు. ఆ సందర్భంలో రాణి చాక్లెట్‌ను తీసుకొచ్చింది. దీని తర్వాత దేశం మొత్తం కోకో తోటలను ప్రారంభించింది. అలా చాక్లెట్ ప్రాచుర్యంలోకి వచ్చింది అంటారు. ఐరాపాలో రాజు కుటుంబీకులు ఎక్కువగా చాక్లెట్ తింటారు. చాక్లెట్ నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని వారు నమ్ముతారు.

చాక్లెట్ కనిపెట్టిన రోజుల్లో వేడిగా ఉండేవి. ఆ రోజుల్లో కోకో విత్తనాలను పులియబెట్టి, వేయించి గ్రైండ్ చేసేవారు. ఆ తర్వాత అందులో నీరు, వనిల్లా, తేనే, సుగంధ ద్రవ్యాలు కలిపి పానియంగా మార్చేవారు. ఆ సమయంలో దానిని రాయల్ డ్రింక్‌గా పిలిచేవారు. అది ఐరోపా చేరుకునే సమయానికి తీయగా మారిపోయేది. అలా ఐరోపా చాక్లెట్ మొదటి సారిగా స్పెయిన్ చేరుకుంది. ఆ సమయంలో స్పానిష్ అన్వేషకుడు హెర్నాండో కోర్టెస్ అబ్జెక్ మాంటెజుమా అక్కడికి చేరుకున్నాడు. అక్కడే అతను తొలిసారిగా చాక్లెట్‌ను పరిచయం చేశాడు.

పారిశ్రామిక విప్లవం చాక్లెట్ తయారీలో వినుత్నమైన మార్పులు తీసుకొచ్చింది. 1828 తర్వాత మొదటి సారి చాక్లెట్ బార్‌లు వచ్చాయి. కోకో గింజల నుంచి కోకో వెన్నను వేరు చేసి దాన్ని పౌడర్ చేస్తారు. ఆ పౌడర్‌ను ద్రవాలతో కలిపి అచ్చులో పోస్తారు. అది చాక్లెట్ బార్‌గా గడ్డకడుతుంది.

Read More : Valentine Week 2024 : వాలెంటైన్ వీక్.. ప్రతిరోజూ ఎంతో మధురమైనది..!

1847లో జోసెఫ్ ఫ్రై తొలిసారిగా ఆధునిక చాక్లెట్ బార్‌ను తయారు చేశాడు. 1868 నాటికి క్యాడ్‌బరీ అనే చిన్న కంపెనీ ఇంగ్లాండులో చాక్లెట్ క్యాండీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది నెస్లే అనే మరొక కంపెనీకి మార్గదర్శకత్వం చేయబడింది. కొన్ని సంవలత్సరాల తర్వాత మిల్క్ చాక్లెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఒక దివ్యమైన చాక్లెట్ పానీయం తయారై ప్రజలు మెచ్చే చాక్లెట్ తయారైంది.

Tags

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×