BigTV English

Afternoon nap: అక్కడ మధ్యాహ్నం 1 గంట అయితే పాపం.. ఎక్కడివాళ్లు అక్కడే నిద్రపోతారు!

Afternoon nap: అక్కడ మధ్యాహ్నం 1 గంట అయితే పాపం.. ఎక్కడివాళ్లు అక్కడే నిద్రపోతారు!

మధ్యాహ్నం పూట ఒక పావుగంట లేదా అరగంట పాటు అలా కునుకు తీస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. అయితే కొంతమందికి అలా కునుకు తీయడం కుదరదు. మరికొందరికి కునుకు తీద్దామన్న నిద్ర రాదు. కానీ చైనాలోని ఒక ప్రాంతంలో మాత్రం మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం అనేది సంస్కృతిలో భాగంగా మారింది. ఇలా మధ్యాహ్నపు నిద్రను సంస్కృతిని అక్కడ వుజియావో అని పిలుస్తారు. అంటే మధ్యాహ్న నిద్ర అని అర్థం.


వుజియావో ఒక సంప్రదాయం
చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఇలా వుజియావో సంస్కృతి విపరీతంగా పాతుకుపోయింది. వందల సంవత్సరాల నాటి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. మధ్యాహ్నం ఇలా విశ్రాంతి తీసుకోవడం అనేది శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని అంటారు. షాంగ్జీ ప్రావిన్స్ లో ఈ నిద్రా సంస్కృతి వారి జీవితంలో పెద్ద భాగం అయిపోయింది. దీనిని కచ్చితంగా పాటించే వారి సంఖ్య అధికంగానే ఉంది.

మధ్యాహ్నం నిద్ర ఎందుకు ముఖ్యం?
మధ్యాహ్నం నిద్ర అంటే కేవలం కాసేపు కునుకు తీయడం అని మాత్రమే మనకు తెలుసు. కానీ షాంగ్జీలో ప్రజలు దీన్ని సంస్కృతీ, సాంప్రదాయంగా భావిస్తారు. అలాగే అలా నిద్రపోవడం అనేది బలాన్ని సూచిస్తుందని, ఏకాగ్రతను పెంచుతుందని, దృష్టి కేంద్రీకరణకు సహాయపడుతుందని నమ్ముతారు. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత వారు లేచి తాజాగా పనిచేసుకోవచ్చని భావిస్తారు. ఇలా మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచాక చదువుకున్నది బాగా గుర్తుంటుందని అంటారు. షాంగ్జీ ప్రావిన్స్ లో దాదాపు 60 శాతం మంది ప్రజలు క్రమం తప్పకుండా మధ్యాహ్నం కూడా నిద్రపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.


పాఠశాలల్లో నిద్ర
షాంగ్జీ ప్రావిన్స్ లోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు నిద్రించడానికి ప్రత్యేక సమయాన్ని కూడా పొందుతున్నారు. భోజనం తర్వాత వారికి కాసేపు నిద్రపోయే అవకాశాన్ని పాఠశాలలు ఇస్తున్నాయి. ఇందుకోసం వారికి చిన్న మంచాలు, చాపలు వంటివి అందిస్తున్నారు. ఈ విరామం వల్ల మధ్యాహ్నం జరిగే తరగతుల్లో వారు మరింత అప్రమత్తంగా పాఠాలను వింటారని అక్కడ వారి నమ్మకం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇది తమ పిల్లల ఆరోగ్యానికి, అభ్యాసానికి మంచిదని కూడా చెబుతున్నారు. షాంగ్జీలోనే కాదు చైనా అంతటా చాలా చోట్ల పాఠశాలల్లో ఈ అలవాటు ఉంది. ఇది అక్కడ ఎంతో ప్రజాధరణ పొందింది కూడా.

ఆఫీసుల్లో కూడా
కేవలం స్కూల్ పిల్లలకే కాదు షాంగ్జీలోని ఆఫీసుల్లో కూడా వుజియావో సంస్కృతి ఉంది. ఆఫీసు ఉద్యోగులు, దుకాణాదారులు తరచుగా మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోతారు. ఉద్యోగులు తమ డెస్కుల వద్ద నిద్రపోతే దుకాణదారులు కాసేపు దుకాణాలను మూసివేసి నిద్రపోతారు. ఇది వారికి అలసటను తగ్గిస్తుందని మిగతా రోజంతా బాగా పనిచేసేలా ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతారు. చిన్న చిన్న పట్టణాల్లో భోజన విరామ సమయంలో ప్రజలు కుర్చీలు, బెంచీలపైన నిద్రపోవడం కూడా చూడవచ్చు.

వుజియావో ఓ సంప్రదాయంగా షాంగ్జీ ప్రావిన్స్ లోని ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. షాంగ్జీ ప్రావిన్స్ రద్దీగా ఉండే నగరాలను తక్కువగా కలిగి ఉంటుంది. దీని వల్ల వారికి నిద్ర పోవడం కూడా సులభం అవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని స్లీపింగ్ ప్రావిన్స్ అని కూడా పిలుస్తారు.

చైనీస్ నమ్మకాలలో ఆరోగ్యం గురించి పాతుకుపోయినా ఒక పాత సాంప్రదాయం వుజియావో. అయితే శాంతి ప్రజలు మాత్రం దీనిని సంతోషంగా స్వీకరిస్తున్నారు. తాము ఆరోగ్యంగా ఉండడం కోసమే పూర్వం ఈ సాంప్రదాయాన్ని పెట్టి ఉంటారని వారు భావిస్తున్నారు. అందుకే వుజియావోను వారు గౌరవిస్తున్నారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×