BigTV English

Snake in Train: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!

Snake in Train: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!

Indian Railways: గత కొంత కాలంగా రైళ్లలో తరచుగా పాములు కనిపిస్తున్నాయి. ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఎక్కడో ఒకచోట పాములు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో పాము కలకలం సృష్టించింది. రైల్వే కోచ్ టాయిలెట్‌ లో పాము కనిపించడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. స్నేక్ క్యాచర్ ను పిలిపించి పట్టుకున్నారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.


A3 కోచ్ లో పామును గుర్తించిన ప్రయాణీకుడు

ఈ ఘటన మే 4న జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పశ్చిమ బెంగాల్‌ లోని ఫలకట గుండా వెళ్తుండగా A3 కోచ్‌ లో ఒక ప్రయాణీకుడు పామును గమనించాడు. టాయిలెట్ సీలింగ్ లైట్‌ లో అది కనిపించడంతో  షాక్‌ కు గురయ్యాడు. వెంటనే బయకు వచ్చి..  రైల్వే సిబ్బందికి వెంటనే సమాచారం అందించాడు. రైల్వే అధికారులు స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. అతడు ఓ ప్లాస్టిక్ కవర్ సాయంతో పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేశాడు. దీంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలోఎవరికి ఎలాంటి గాయాలు కలగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించింది.. ప్రయాణీకుల భయాన్ని పోగొట్టినట్లు తెలిపారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రాజధాని రైలులో పాము కలకలానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైల్వే సిబ్బంది కూలంగా పామును పట్టుకునే విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిస్థితిని గందరగోళంగా మార్చే ప్రయత్నం చేయకుండా రైల్వే అధికారులు కూల్ గా డీల్ చేశారని నెటిజన్లు అభినందిస్తున్నారు. అయితే, ఈ ఘటన మరోసారి రైళ్లలో భద్రత, పరిశుభ్రత గురించి తీవ్రమైన చర్చను లేవనెత్తింది. ముఖ్యంగా రాజధాని ఎక్స్‌ ప్రెస్ లాంటి ప్రీమియం సర్వీస్‌ లోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌ లోకి పాము ఎలా ప్రవేశించగలదని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు.

గతంలోనూ రైళ్లలో కనిపించిన పాముల  

ఇక రైళ్లలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో, జన శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, జబల్పూర్-ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లలో పాములు కనిపించాయి. ఇలాంటి కేసులు బయటపడిన నేపథ్యంలో రైల్వే సిబ్బంది భద్రతా తనిఖీలు, రైలు కోచ్‌ల మెయింటెనెన్స్ విధానంపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. గతంలో చాలా సార్లు పాములు రైళ్లలో కనిపించినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. కానీ, ప్రీమియం రైళ్లలో అదీ ఏసీ కోచ్ లలో పాములు కనిపించడం ఏంటని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. అటు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలులోకి పాము ఎలా ప్రవేశించిందో పరిశీలిస్తున్నారు. అదే సమయంలో భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.

Read Also: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×