BigTV English

Journalist at War: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…

Journalist at War: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…

War Filed Reporting: యుద్ధం అనేది మొదలు పెట్టడం మన చేతుల్లో ఉన్నప్పటికీ, అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో? ఎంత విధ్వంసానికి కారణం అవుతుందో చెప్పడం కష్టం. యుద్ధంలో ఏదో ఒక దేశం, ఒక పక్షం విజయం సాధించినప్పటికీ, రెండు వైపులా అపార నష్టం అనేది తప్పదు. యుద్ధ భూమి నుంచి పలువురు ఎంతో ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొంత మంది తీవ్రగాయాల పాలై ప్రాణాలతో బయటపడిన పరిస్థితులూ ఉన్నాయి. తాజాగా సైనిక స్థావరం నుంచి రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


రిపోర్టర్ మీదికి దూసుకొచ్చిన సైనిక హెలికాఫ్టర్..

అజర్ బైజాన్ కు చెందిన సాయుధ బలగాలు 100వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా తమ ఆర్మీ సైనిక విన్యాసాలు చేసింది. ఈ వేడుకను కవర్ చేయడానికి సిబిసి టీవీ చీఫ్ ఎడిటర్ ఎల్మిరా ముసాజాదే వైమానిక కేంద్రానికి వెళ్లింది. సైనిక విన్యాసాల ప్రారంభమానికి ముందు పీటూసీ చెప్పాలనుకుంది. బ్యాగ్రౌండ్ లో ఆర్మీ హెలికాఫ్టర్లు వస్తున్నట్లు ఫ్రేమ్ ఫిక్స్ చేయించుకుని పీటూసీ చెప్పడం మొదలు పెట్టింది. ఈ సమయంలో అనుకోని ఘటన జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.


ఆమె రిపోర్టింగ్ చేస్తుండగా రెండు మిగ్ 24 అటాకింగ్ హెలికాప్టర్లు ముందుకు వెళ్లిపోయాయి. మరో హెలికాప్టర్ ఆమె వైపు దూసుకొచ్చింది. ఆమె దగ్గరికి రాగానే కాస్త పైకి వెళ్లింది. అలాగే కాస్త ముందుకు వస్తే ఆమెకు తగిలేది. హెలికాఫ్టర్ ధాటికి ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. కేవలం కొన్ని అంగుళాల ఎత్తులో వెళ్లడంతో ఆమె ప్రాణాలతో బయపడింది. హెలికాప్టర్ వేగానికి ఆమె జుట్టు చెల్లాచెదురు అయ్యింది. అయినప్పటికీ, కాసేపట్లోనే ఆమె సెట్ రైట్ అయి, మళ్లీ తన పీటూసీని కంటిన్యూ చేసింది.

Read Also: నిద్రలేచే లోపే లేపేశారు కదయ్యా.. పాకిస్తాన్‌పై పేలుతున్న జోకులు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

తాజాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్మీ హెలికాఫ్టర్ అంత దగ్గరగా వచ్చినా, ఆమె ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ముసాజాదే ధైర్యంగా రిపోర్టింగ్ చేయడం నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అంత ధైర్యవంతురాలు కాబట్టే ఆమెను రిపోర్టింగ్ కోసం సైనిక స్థావరానికి పంపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ధైర్యవంతులైన జర్నలిస్టులు సమాజానికి ఎంతో అవసరం అంటున్నారు. అన్నట్లు ఈ ఘటన 2018లో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also: నిద్రలేచే లోపే లేపేశారు కదయ్యా.. పాకిస్తాన్‌పై పేలుతున్న జోకులు!

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×