BigTV English

India Pakistan War: యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రజలు ఇండియాను వ్యతిరేకించరు.. పాక్ ముస్లిం పెద్ద వ్యాఖ్యలు

India Pakistan War: యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రజలు ఇండియాను వ్యతిరేకించరు.. పాక్ ముస్లిం పెద్ద వ్యాఖ్యలు

India Pakistan War| పాకిస్తాన్ లో రెండు దేశాలున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సాధారణంగా దేశమంటే ప్రజలు కానీ.. పాకిస్తాన్ లో మాత్రం విచిత్ర పరిస్థితి పాకిస్తాన్ అంటే ప్రజలు వేరు, మిలిటరీ వేరే. అక్కడ ప్రజలు చనిపోతున్నా అక్కడి ఆర్మీ వేరే దేశంగా జీవిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీకి విదేశాల్లో వ్యాపారాలున్నాయి. ఇలాంటి వ్యవస్థ ఏ దేశంలోనూ లేదు. పాకిస్తాన్ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అది కేవలం కీలుబోమ్మ లాంటిదే.


పాక్ ఆర్మీ ఏం చెబితే అధికారంలో ఉన్న నాయకులు వారి మాటలు వినాల్సిందే. ఈ తీరుతో పాకిస్తాన్ ప్రజలు విసుగెత్తిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రజలకు సరైన ఆహారం దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది. పైగా ఎవరైనా ఎదురు తిరిగితే పాక్ సైన్యం వారిని చంపేస్తుంది. ప్రభుత్వమైతే ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి అసలు లేదు. ఈ నేపథ్యంలో తాజాగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగేలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పౌరులు చాలా మంది తమ దేశ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రముఖ ముస్లిం మత పెద్ద అబ్దల్ అజీజ్ గాజీ కూడా భారతదేశంతో తమ దేశానికి యుద్ధం జరిగితే పాక్ ప్రభుత్వానికి సొంత ప్రజలే వ్యతిరేకంగా నిలబడతారని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు.


ఆయన ఒక మత ప్రచార ప్రసంగంలో భాగంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో గత శుక్రవారం నాటిది. శుక్రవారం మసీదులో మత పెద్ద అబ్దుల్ అజీజ్ తన ఎదురుగా ఉన్న ఫ్రజలను ఒక ప్రశ్ని అడిగారు.. “పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ప్రారంభమైతే.. మీలో ఎంతమంది పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి.” అని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే చేతులు ఎత్తారు. అది చూసి ఆయన స్పందిస్తూ.. “చాలా తక్కువ సంఖ్యలో చేతులు కనిపిస్తున్నాయి. అంటే దీనర్థం ప్రజలకు ఇప్పుడు మంచి చెడు అర్థమవుతోంది. ఇండియాతో పాకిస్తాన్ చేసే యుద్ధం ఇస్తామిక్ యుద్ధం కాదు. ఈ రోజు ఇండియా కంటే ఎక్కువ అవినీతి పాకిస్తాన్ లో ఉంది. ఇక్కడ అంతా నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఇండియాలో కంటే ప్రజలు పాకిస్తాన్ లో అణచివేతకు గురవుతున్నారు. ఇక్కడ మసీదులు పేల్చేస్తున్నారు. కానీ భారతదేశంలో అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ఘటనలు అక్కడ జరగవు.

Also Read: భారత్ ప్రతీకారం.. కన్నీరు పెట్టుకున్న పాక్ టీవి యాంకర్

వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతాల్లో పాకిస్తాన్ యుద్ద విమానాలు సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించాయి. ఇండియాలో ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఎంత మంది ప్రజలు కనబడకుండా పోయారో ఆ సంఖ్య కూడా చెప్పలేకపోతున్నాం. కనిపించకుండా పోయిన వారి కోసం వారి కుటుంబాలు రోడ్లపై నిరసనలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. ఇక్కడ జర్నలిస్టులు మాయమైపోతున్నారు. ఇస్లాం గురించి నిజాయితీగా బోధించే మతపెద్దలు కనబడకుండా పోయారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కనబడకుండా పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ పౌరులు ఇండియాను వ్యతిరేకించరు, పాక్ ప్రభుత్వానికి అండగా నిలవరు.” అని ఉద్వేగంగా ప్రసంగించారు.

ఈ వీడియో వైరల్ అవుతుండడంతో నెటిజెన్లు పాకిస్తాన్ ప్రజల పట్ల సానుభూతి తెలుపుతున్నారు. పాక్ ప్రభుత్వానికి, అక్కడి మిలిటరీకీ గట్టిగా బుద్ధి చెప్పే సమయం వచ్చిందంటున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×