Viral video: ఇటీవల సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే తెలిసిపోతుంది. వైరల్ వీడియోలు లక్షల మంది వీక్షిస్తున్నారు. కొన్ని వీడియోలకు అయితే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా హైప్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే.. ఇంట్రెస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే నెటిజన్లు వీడియోల కింద చేసే కామెంట్స్ మరింత ఫన్నీగా ఉంటున్నాయి. అయితే.. తాజాగా థాయిలాండ్‌లో పంజాబీ పాటలకు భారతీయ పర్యాటకులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్‌లో చిత్రీకరించిన ఈ వీడియోపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు సమర్థిస్తున్నారు.
dear desi tourists abroad
WE BEG YOU 🙏🏼…
if you weren’t a singer, dancer, stand-up comic or wildlife whisperer back home …
this is not the time to start
let’s not make the whole planet suffer 2nd-hand embarrassment on our behalf pic.twitter.com/7bvFn8ulF7
— JΛYΣƧΉ (@baldwhiner) June 20, 2025
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. థాయిలాండ్ లోని బ్యాంకాక్‌లో ఉన్న సఫారీ వరల్డ్ జూ చాలా ఫేమస్. ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇక్కడకు వచ్చిన భారతీయులు పంజాబ్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియో కనిపిస్తోంది. ఈ వీడియో చాలా మంది పాటకు డ్యాన్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘థాయిలాండ్‌లో థాయ్ ప్రజలను చూడడానికి వచ్చాం కానీ ఇక్కడ భారతీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
ALSO READ: CBI Jobs: సీబీఐలో 4500 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నెలకు రూ.15వేల స్టైఫండ్ భయ్యా
ఈ వీడియోలో వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే.. అక్కడ ఎక్కువగా థాయ్ ప్రజలకంటే.. భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల ప్రజలు చాలా తక్కువగా ఉన్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. వారు కొంత ఆశ్చర్యంగా.. ఇబ్బందికరంగా ఈ వీడియోను చూస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న విధాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఈ డ్యాన్స్ చేసిన పర్యాటకుల ప్రవర్తనను తప్పు బడుతున్నారు. ఇది చాలా అసభ్యకరం, సిగ్గు చేటు అని విమర్శిస్తున్నారు. వేరే దేశాల్లో ఇలా ప్రవర్తించడం వల్ల మనకు వీసాలు ఇచ్చేందుకు ప్రపంచ దేశాలు భయపడుతాయి అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. వేరే దేశాలకు వెళ్లినప్పుడు కాస్త పద్ధతిగా ఉండాలని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ALSO READ: NRSC Jobs: గోల్డెన్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు, లక్ష 77వేల జీతం
అయితే, కొంతమంది నెటిజన్లు భారత్ పర్యాటకులకు మద్దతుగా నిలిచారు. వారు ఈ మోమెంట్‌ను.. జస్ట్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు భావించారు. వారు వెళ్లిందే ఎంజాయ్ చేయడానికి అని.. వారు సంతోషంగా ఉన్నారు.. ఇందులో ఇబ్బంది ఏముందని అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరో వ్యక్తి సాంగ్ పెడితే ఎవరైనా డ్యాన్స్ చేస్తారు అని కామెంట్ చేశాడు. ఏదో సరదాగా డ్యాన్స్ వేస్తున్నారు.. వారిని ఎంజాయ్ చేయనివ్వండి.. వేరే వాళ్లకు ఏంటి ఇబ్బంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.