Hyderabad to Tirupati: ఒక ఊరి ప్రయాణాన్ని షార్ట్‌కట్‌లోకి మార్చే మార్గం ఏదైనా ఉంటే.. దాని విలువ చెప్పలేము. వందల కిలోమీటర్ల దూరాన్ని ఓ చిన్న మార్గం కుదిస్తే, ఎంత సమయం, ఎంత డీజిల్, ఎంత మానసిక శాంతి ఆదా అవుతాయో ఊహించడమే కష్టం. అలాంటి ఓ మార్గమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి శుభారంభం ఇవ్వబోతోంది. కానీ చాలా మందికి ఇది ఇంకా తెలియదు. అదేమిటో తెలుసుకుంటే ఔరా అనేస్తారు.
వందల కిలో మీటర్లకు ఇక సెలవు..
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణం చేసే వారికి ఇది రొటీన్ ప్రశ్న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే ఎన్ని గంటలుంటుంది? ఇప్పటివరకు 570 నుండి 600 కిలోమీటర్ల దూరంతో ప్రయాణం సాగేది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఓ నిర్ణయం వల్ల, ఈ దూరం కుదించబోతోంది. నిజంగా చెప్పాలంటే.. ఇది ప్రయాణికులకు అతి పెద్ద గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
అసలు విషయం ఇదే..
ఇంతకీ విషయమేంటంటే కేంద్రం తాజాగా కల్వకుర్తి – జమ్మలమడుగు జాతీయ రహదారి ప్రాజెక్ట్ కింద, నల్లకాల్వ – వెలుగోడు మధ్య 17 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది. ఈ రహదారి పూర్తయితే, హైదరాబాద్ – తిరుపతి మధ్య దూరం దాదాపు 70 కిలోమీటర్ల వరకు తగ్గనుంది. ఇదేంటో చిన్న వార్తలా అనిపించవచ్చు.. కానీ దీని వెనుక ప్రయోజనాలు ఎంతో పెద్దవి.
ఈ రహదారితో ప్రయోజనాలు ఇవే
ఈ కొత్త రహదారి నిర్మాణం అనంతరం, నల్లకాల్వ నుంచి వెలుగోడు వరకు నేరుగా ప్రయాణించే వీలవుతుంది. ఇప్పటివరకు ఈ మధ్యలో ఉన్న మలుపులు, దారితప్పే మార్గాలు వలన ప్రయాణానికి సమయం పెరిగేది. కానీ ఇప్పుడు ఈ లింక్ రోడ్‌తో ఓ క్లియర్ షార్ట్‌కట్ లభించబోతోంది. అదీ కాకుండా, ఈ మార్గం పూర్తి అవ్వడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాల సంఖ్య, వాణిజ్యం, ముడిపడి ఉన్న ప్రజల సంభంధాలు కూడా మరింత బలపడతాయి.
ఈ ప్రాజెక్ట్‌కి కేంద్రం మంజూరు చేసిన రూ. 400 కోట్లు కేవలం రహదారి నిర్మాణానికి మాత్రమే కాదు.. అవసరమైన బ్రిడ్జ్‌లు, డ్రెయినేజ్, సైడ్వాల్స్, సెక్యూరిటీ మెజర్స్ అన్నిటికీ ఉపయోగించనున్నారు. త్వరితగతిన టెండర్లు రప్పించి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే.. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లే చాలామంది యాత్రికులు, విద్యార్థులు, వ్యాపారులు ఇకపై తమ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇప్పటివరకు రాయచోటి – బైరాగిపట్లం – మదనపల్లి మార్గాలపై మాత్రమే ఆధారపడేవారు. కానీ ఈ కొత్త మార్గం ఓ ప్రత్యామ్నాయ రూట్‌గా అందుబాటులోకి రాబోతోంది.
Also Read: Vizag Navy Ship News: విశాఖకు వచ్చిన రక్షకుడు.. తోక జాడిస్తే చుక్కలే!
ప్రయాణికుల మాటల్లో చెప్పాలంటే.. ఇంతకాలంగా మేము ప్రయాణించే దారిలో ఎంత టైమ్ వేస్ట్ అవుతుందో ఇప్పుడు అర్థమైంది. ఈ కొత్త రోడ్ వల్ల మా ప్రయాణాలు హాయిగా మారుతాయని అంటున్నారు. ఆర్థికవేత్తలు కూడా ఈ మార్గం వలన ప్రయాణ వ్యయం తగ్గడం వల్ల స్థానిక ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇలా ఒక చిన్న మార్గం నిర్మాణం వెనక చాలా పెద్ద ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది కేవలం ప్యాసింజర్ ప్రయాణం మాత్రమే కాదు.. మౌలిక వసతులలో గొప్ప అడుగు. సమయం, ఇంధనం, మానవశ్రమ.. అన్నిటినీ ఆదా చేసే మార్గం ఇది. రానున్న రోజుల్లో ఈ రహదారి పూర్తవగానే, తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుంది.
అందుకే ఇప్పటి నుంచే మీ ప్లాన్స్‌కి మార్పులు తీసుకురండి. తిరుపతి పిలిస్తే, ఇక మనం కూడా సమయాన్ని ఆదా చేస్తూ, సులభంగా వెళ్లే దారిలో ప్రయాణించవచ్చు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోని పవిత్ర క్షేత్రాల వరకూ.. ఇప్పుడు రోడ్డు దారి మరింత దగ్గరగా వచ్చింది!