BigTV English

Indians Less Pay: అమెరికన్లకంటే భారతీయులకు తక్కువ జీతం ఇవ్వాలి.. వ్యాపారవేత్త వివాదాస్పద వ్యాఖ్యలు

Indians Less Pay: అమెరికన్లకంటే భారతీయులకు తక్కువ జీతం ఇవ్వాలి.. వ్యాపారవేత్త వివాదాస్పద వ్యాఖ్యలు

Indians Less Pay Than Americans | అల్పాదాయ దేశాల్లోని ఉద్యోగులకు అమెరికన్ కంపెనీలు స్వదేశీయులకంటే తక్కువ శాలరీలు ఇవ్వొచ్చంటూ ఓ వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్య నెట్టింట ప్రస్తుతం గగ్గోలు పుట్టిస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఫ్రాంకో పరేరా అనే వ్యాపారవేత్త ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పరేరా.. ‘నీయర్’ అనే మానవవనరుల సంస్థను స్థాపించారు. అమెరికాలోని అంతర్జాతీయ సంస్థలకు లాటిన్ అమెరికాలోని ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌లో నీయర్ కంపెనీ సాయపడుతుంది. ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగుల జీత భత్యాలను.. అమెరికన్ ఉద్యోగులతో పోలుస్తూ ఆయన పలు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.


‘‘భారత్ లాంటి విదేశీ ఉద్యోగులకు అమెరికన్ కంపెనీల కంటే తక్కువ శాలరీ ఇచ్చినా తప్పేమీ లేదు. సంస్థలన్నీ తక్కువ శాలరీతో ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటాయి. కాబట్టి, అమెరికన్ వర్కర్లకు ఇచ్చే బెనిఫిట్స్ ఏవీ వారికి ఇవ్వవు. ఈ వ్యాఖ్యలు చాలా మందిని హర్ట్ చేసి ఉండొచ్చు. అర్జెంటీనాకు చెందిన వ్యక్తిగా నేను దీన్ని అర్థం చేసుకోగలను. కానీ, జీవన వ్యవయాలు తక్కువగా ఉన్న దేశంలో హ్యాపీగా కుటుంబంతో కలిసి ఉంటున్న వ్యక్తికి తక్కువ శాలరీ ఇవ్వొచ్చు. వర్క్ ఫ్రం హోం చేసుకుంటూనే ఇలాంటి వారు చక్కని ఆదాయాలు పొందుతారు’’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: 2024లో మారిన ప్రపంచ రాజకీయాలు.. ఏ దేశంలో ఏం జరిగిందంటే..


ఆఫ్ షోరింగ్‌పై మరో పోస్టులో పరేరా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక కంపెనీలు తక్కువ శాలరీలు ఇచ్చి విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయని అన్నారు. కంపెనీల దృష్టిలో ఈ ఉద్యోగులకు పెద్దగా విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇండియన్లు, ఫలిప్పీన్స్ వంటివారు ఇలాంటి కంపెనీల బారిన ఎక్కువగా పడుతుంటారని విచారం వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు విదేశీ ఉద్యోగులకు కావాల్సిన మద్దతు కూడా ఇవ్వవని తెలిపారు. ఈ తీరు అటు ఉద్యోగులకు ఇటు సంస్థలకు నష్టదాయకమని తెలిపారు. అసంతృప్తి కారణంగా ఉద్యోగులు కొద్ది నెలలకే సంస్థలను వీడుతుంటారని, నిత్యం కొత్త ఉద్యోగుల రాకతో సంస్థల్లో ఏపనీ సరిగా జరగక ఉత్పాదకత పడిపోతుందని విచారం వ్యక్తం చేశారు.

కాగా, ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు పరేరా అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘ఆఫ్‌షోరింగ్ అంటే అంతే.. అమెరికన్లతో సమానంగా విదేశీయులకు జీతాలు ఇచ్చేటట్టైతే కార్పొరేట్ కంపెనీలో అసలు విదేశీయులను ఉద్యోగంలోకే తీసుకోవు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

గ్లోబల్ టెక్ రంగంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో సాస్ సంస్థలు అభివృద్ధిలోకి వచ్చాక ఇక్కడి వారు గ్లోబల్ మార్కెట్లో అనేక సృజనాత్మక ఉత్పత్తులను విడుదల చేశారు. అయితే, ఆఫ్‌షోరింగ్ కారణంగా అమెరికా ఆర్థికవ్యవస్థపై కలిగే ప్రభావాలు ఏమిటనేదానిపై భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. స్థూలంగా ఆఫ్‌షోరింగ్ అమెరికాకు మేలు చేస్తుందని ఆర్థికవేత్తలంటే సగటు అమెరికన్ మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తుంటారు.

తమ ఉద్యోగాలు ఇతరులు ఎగరేసుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విదేశీయుల రాకను కట్టడి చేయాలన్న డిమాండ్లు కూడా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇటీవల కెనడా ప్రభుత్వం తమ దేశంలో వలసలను కట్టడి చేసేందుకు వివిధ వీసాలపై ఆంక్షలకు తెరలేపిన విషయం తెలిసిందే.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×