Kohli – Rohit: బోర్డర గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా మొన్న జరిగిన బిస్బెన్ టెస్ట్ డ్రా తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ పర్యటన ముగిసేలోగా మరికొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ ను ప్రకటించవచ్చని క్రికెట్ కారిడార్ లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్, జడేజాలు టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Sachin Tendulkar: సచిన్ కు దక్కిన అరుదైన గౌరవం… చరిత్రలోనే తొలిసారి
ఇలాంటి తరుణంలోనే… ఆస్ట్రేలియా వెటరన్ అండ్ క్రికెటర్ మరియు భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ( Greg Chappell) రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మీరు ఫామ్ లో ఉన్నారా లేదా అనే విషయాలు మీకు మాత్రమే తెలియాలి అన్నాడు చాపెల్. ప్రతి ఆటగాడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటాడు. అంతేకాదు ఒక ఆటగాడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడే హక్కు అతనికి మాత్రమే ఉంటుందని చాపెల్ చెప్పారు. అయితే ఫామ్ కొనసాగించాలని చాపెన్ అభిప్రాయపడ్డాడు.
వయసు మీద పడిన తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన అకస్మాత్తుగా తగ్గడంపై చాపెల్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే ఒక మంచి ఆటగాడిని వయసు మాత్రమే నిర్ధారిస్తుందని నేను ఎప్పుడూ అనుకోవడం లేదని చాపెల్ అన్నాడు. ఇది మానసిక సామర్థ్యం మరియు ఏకాగ్రత పైన ఆధారపడి ఉంటుందని చాపెల్ అన్నాడు. బహుశా వయసు పెరిగే కొద్దీ అట తగ్గిపోతుంది. ఇంతకుముందు ఉన్న ఏకాగ్రత తర్వాత ఉండకపోవచ్చని ఆ స్థాయిలో ఉన్నప్పుడు పరుగులు చేయడానికి వికెట్లు పడగొట్టడానికి కష్టపడాల్సి వస్తుందని చాపెల్ చెప్పాడు.
ఇక రిటైర్మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగతం అని చెప్పాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు తన అన్న నీలో ఇంకా క్రికెట్ ఆట మిగిలే ఉందని చెప్పారట. అయితే తనకు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని తనకు ఆ విషయం అప్పుడే తెలిసిందని వివరించాడు భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ( Greg Chappell). అందుకే రిటైర్మెంట్ తీసుకున్నానని భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ( Greg Chappell) అన్నాడు.
Also Read: IND-W vs WI-W: వెస్టిండీస్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టు
రిటైర్మెంట్ విషయంలో ఆటగాడిదే తుది నిర్ణయం కావాలని చాపెల్ అన్నాడు. ఒక క్రికెటర్ తన రిటైర్మెంట్ విషయంలో ఎవరు ఎన్ని సూచనలు ఇచ్చినా తనకు తన రిటైర్మెంట్ పైన నమ్మకం వచ్చినప్పుడు క్రికెట్ కు వీడ్కోలు పలకాలని చెబుతున్నాడు భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ( Greg Chappell). ఇక ప్రస్తుతం ఫామ్ ప్రకారం… రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా టెస్ట్ ల నుంచి వైదొలగాలని డిమాండ్ వినిపిస్తోంది.